India vs South Africa: భారత్‌కు షాక్‌.. 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం.. అంతా ఈ బౌలర్‌ వల్లే..

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి టెస్టు మ్యాచు జరిగింది.

India vs South Africa: భారత్‌కు షాక్‌.. 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం.. అంతా ఈ బౌలర్‌ వల్లే..

Updated On : November 16, 2025 / 3:08 PM IST

India vs South Africa: కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159, రెండో ఇన్నింగ్స్‌లో 153 పరుగులు చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 189, రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులు మాత్రమే చేసింది. సౌతాఫ్రికాపై భారత్ సులభంగా గెలుస్తుందని అనుకుంటే బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది.

Also Read: రూ.1.61 లక్షల కోట్లకు చేరిన దిగుమతుల బిల్లు.. వంటనూనె ధరలూ పెరిగిపోతే..

రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 1, వాషింగ్టన్ సుందర్ 31, ధ్రువ్ జురేల్ 13, రిషబ్ పంత్ 2, రవీంద్ర జడేజా 18, అక్షర్ పటేల్ 26, కుల్దీప్ యాదవ్ 1 పరుగులు చేయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఒక్క పరుగూ చేయలేదు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 4 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీయగా, ఐడెన్ మార్క్రమ్ ఒక్క వికెట్ పడగొట్టాడు.