Stephan Pascal Catch
Stephan Pascal Catch : క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఫీల్డర్లు చేసే విన్యాసాలు అబ్బుర పరుస్తుంటాయి. తాజాగా దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో అలాంటి ఓ ఘటన జరిగింది. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు స్టీఫెన్ పాస్కల్ పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో శామ్ కాన్‌స్టాన్స్ (108; 121 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) శతకం బాదాడు. రాఫ్ మాక్‌మిలన్ (29), హ్యూ వీబ్జెన్ (22) లు రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో నాథన్ ఎడ్వర్డ్స్ మూడు వికెట్లు తీశాడు. ఇసై థోర్న్ రెండు వికెట్లు పడగొట్టాడు. రానికో స్మిత్, నాథన్ సీలీ, టార్రిక్ ఎడ్వర్డ్ తలా ఓ వికెట్ సాధించారు.
IND vs ENG 2nd Test : కామెంట్రీ మధ్యలోనే వెళ్లిపోయిన సునీల్ గవాస్కర్..
అద్భుత క్యాచ్..
ఆసీస్ ఇన్నింగ్స్ 43 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లోని చివరి బంతిని మాక్‌మిలన్ షాట్ ఆడాడు. బంతి పాయింట్ దిశగా దూసుకువెళ్లింది. కొంచెం దూరంలో ఫీల్డింగ్ చేస్తున్న స్టీఫెన్ పాస్కల్ పక్షిలా గాల్లోకి ఎగిరి బంతిని రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాట్ ఏ క్యాచ్ అంటూ మెచ్చుకుంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Yashasvi Jaiswal : విశాఖలో విధ్వంసం.. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ.. అరుదైన జాబితాలో చోటు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 4.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 24 పరుగులు చేసిన సమయంలో వర్షం మొదలైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.