IND vs ENG 2nd Test : కామెంట్రీ మధ్యలోనే వెళ్లిపోయిన సునీల్ గవాస్కర్..
భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

Sunil Gavaskar
IND vs ENG 2nd Test – Sunil Gavaskar : భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆటకు రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత కామెంటేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు జియో సినిమా ఇంగ్లీష్ కామెంటేటర్‌గా వహరిస్తున్నారు. అయితే.. విశాఖ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచు తొలి రోజున సునీల్ గవాస్కర్ కామెంట్రీని మధ్యలోనే వదిలివేసి ఇంటికి వెళ్లిపోయాడు. అతడి ఇంట్లో ఓ విషాదం చోటు చేసుకోవడంతోనే ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.
గవాస్కర్ అత్త అయిన పుష్పా మొహోత్ర శుక్రవారం మరణించారు. ఈ విషయం తొలి సెషన్ ముగిసిన తరువాత గవాస్కర్‌కు తెలిసింది. వెంటనే అతడు కామెంట్రీ ఆపేసి వెళ్లిపోయాడు. తన భార్యతో కలిసి కన్పూర్ బయలు దేరాడు.
Yashasvi Jaiswal : విశాఖలో విధ్వంసం.. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ.. అరుదైన జాబితాలో చోటు
Sunil Gavaskar’s mother-in-law passes away.#INDvsENG #SunilGavaskar #IndianCricket #CricketTwitter pic.twitter.com/trMXiTfeSb
— InsideSport (@InsideSportIND) February 2, 2024
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (209; 290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు) డబుల్ సెంచరీ బాదాడు. శుభ్‌మన్ గిల్ (34), రజత్ పాటిదార్ (32), శ్రేయస్ అయ్యర్(27), అక్షర్ పటేల్ (27)లు ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (14), కేఎస్ భరత్ (17)లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లు తలా మూడు వికెట్లు పడగొట్టారు.. టామ్ హార్ట్లీ ఓ వికెట్ తీశాడు.
U-19 World Cup : నేపాల్ పై ఘన విజయం.. సెమీస్‌లో అడుగుపెట్టిన భారత్