Steve Smith
AUS vs IND 4th Test: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అత్యంత కీలకమైన నాల్గో టెస్టు మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. గురువారం ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. రెండోరోజు (శుక్రవారం) ఆట ప్రారంభం కాగా.. స్టీవ్ స్మిత్ దూకుడుగా ఆడి సెంచరీ పూర్తి చేశాడు. ఆ తరువాత కొద్దిసేపటికే వరుసగా వికెట్లు కోల్పోవటంతో తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 474 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే, ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ సెంచరీ (140)తో టీమిండియా పై సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
Also Read: IND vs AUS 4th Test : విజృంభించిన భారత బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 ఆలౌట్..
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా స్టీవ్ స్మిత్ భారత్ పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా అవతరించాడు. భారత్ పై ఇప్పటి వరకు 43 ఇన్నింగ్స్ లు ఆడిన స్మిత్.. 11 సెంచరీలు చేశాడు. ఆ తరువాత స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ ఉన్నాడు. జోరూట్ భారత్ జట్టుపై మొత్తం 55 ఇన్నింగ్స్ లు ఆడగా.. అందులో 10 సెంచరీలు చేశాడు. వీరి తరువాత స్థానంలో గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ ఒక్కొక్కరు ఎనిమిది సెంచరీలతో తరువాతి స్థానాల్లో నిలిచారు. మరోవైపు మెల్ బోర్న్ మైదానంలో స్టీవ్ స్మిత్ కు ఇది ఐదో సెంచరీ కావడం విశేషం.
టీమిండియా బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా నాలుగు వికెట్లు పొడగొట్టాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు , ఆకాశ్ దీప్ రెండు, సుందర్ ఒక వికెట్ తీశారు. మరోవైపు రెండోరోజు ఆటలో టీమిండియా ఆటగాళ్లు ఎడమ చేతికి నల్ల రిబ్బన్లను ధరించి మైదానంలోకి వచ్చారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాప సూచికంగా నల్ల రిబ్బన్లను చేతికి కట్టుకొని భారత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు.
From 299/6 to 474/10.
Australia added 175 runs for the last 4 wickets. pic.twitter.com/hxLfF6JC3q
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 27, 2024