IND vs AUS 4th Test : విజృంభించిన భారత బౌలర్లు.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 ఆలౌట్..
మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది.

pic credit@ x
మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (140; 197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగాడు. మార్నస్ లబుషేన్ (72; 145 బంతుల్లో 7 ఫోర్లు) సామ్ కొన్‌స్టాస్ (60; 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఖవాజా (57; 121 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. పాట్ కమిన్స్ (49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు తీశాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్‌దీప్ రెండు, సుందర్ ఓ వికెట్ సాధించాడు.
ఓవర్ నైట్ స్కోరు 311/6తో రెండో రోజు ఆటను ఆరంభించిన ఆసీస్ మరో 163 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (68), పాట్ కమిన్స్ (8) లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. స్మిత్ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు. మరో ఎండ్‌లో కమిన్స్ ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 167 బంతుల్లో స్మిత్ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది 34వ శకతం.
అర్థశతకానికి చేరువైన కమిన్స్‌ను జడేజా బోల్తా కొట్టించాడు. జడేజా బౌలింగ్‌లో కమిన్స్ భారీ షాట్‌కు యత్నించాడు. నితీశ్ రెడ్డి సూపర్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఏడో వికెట్‌కు స్మిత్, కమిన్స్ జోడీ 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.
ఆ తరువాత కొద్ది సేపటికే మిచెల్ స్టార్క్ (15), స్మిత్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే.. ఆఖరి వికెట్ ను తీసేందుకు బౌలర్లు కాస్త శ్రమించారు. లియోన్ (13)ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. పదో వికెట్‌కు బొలాండ్ (6), లియోన్‌లు 19 పరుగులు జోడించారు.
IND vs AUS 4th Test: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా..? యశస్వి జైస్వాల్ పై మండిపడ్డ రోహిత్ శర్మ..
Innings Break!
Australia are all out for 474 runs.
4/99 – Jasprit Bumrah
3/78 – Ravindra JadejaScorecard – https://t.co/MAHyB0FTsR… #AUSvIND pic.twitter.com/IHyCweNUV1
— BCCI (@BCCI) December 27, 2024