2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకోవాలని చైనా సీరియస్‌గా..: స్టీవ్ వా
చైనాలో 1800 నుంచే క్రికెట్ ఉంది. అయితే, చైనాలో ఇతర క్రీడల్లా అది పాపులర్ కాలేదు.

Steve Waugh
చైనా క్రికెట్‌లోనూ రాణించాలనుకుంటోందంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగే 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకువచ్చే టీమ్‌ను రెడీ చేసుకోవడంలో సీరియస్‌గా పనిచేస్తోందని తెలిపారు. 2028 ఒలింపిక్స్ ద్వారా ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్పించాలని ఎన్నో ఏళ్లుగా ఐసీసీ కృషి చేసింది. దీని ఫలితంగా 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చుతున్నట్లు 2023లో అధికారికంగా ప్రకటన వచ్చింది. చైనాలో 1800 నుంచే క్రికెట్ ఉంది. అయితే, చైనాలో ఇతర క్రీడల్లా అది పాపులర్ కాలేదు.
ఇప్పుడు చైనాలోని తొమ్మిది నగరాల్లో క్రికెట్ ఆడుతున్నారు. చైనాలో క్రికెట్ గురించి స్టీవ్ వా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒలింపిక్స్‌లో మళ్లీ క్రికెట్ ఉంటుందని ప్రకటన వచ్చినప్పటి నుంచే ఆసియాలోని కీలక దేశాలు పతకాన్ని గెలుచుకోవడం కోసం తమ సన్నాహాలు ప్రారంభించాయని స్టీవ్ వా అన్నారు.
“ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చినట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే చైనా ఒక జట్టును తయారు చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. స్వర్ణ పతకాన్ని గెలవాలన్న లక్ష్యంతో ఉంది. టీ20 ఫార్మాట్ ఇప్పుడు చాలా ప్రసిద్ధి చెందింది. దాని విలువ బిలియన్ డాలర్లు, ప్రతిరోజూ దాని విలువ పెరుగుతోనే ఉంది.
క్రికెట్లో టెస్ట్ క్రికెట్ మనుగడలో ఉన్నప్పటికీ టీ20 ఆధిపత్యం చెలాయిస్తుంది. ఫ్రాంచైజ్ బేస్డ్ జట్లు ఆటగాళ్లను తీసుకుంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. టీ20లు కమర్షియల్‌గా సక్సెస్ అవుతుండడంతో భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలంటే ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు” అని ఆయన అన్నారు.
ఇటీవలే స్టీవ్ వా వన్డేల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్డే క్రికెట్ బతకదని అందరూ అనుకుంటున్నారని, అయితే, వన్డే ఫార్మాట్‌కు ప్రపంచకప్ ఉందని, అది చాలా పెద్ద టోర్నీ అని చెప్పారు. వాటిని రేటింగ్స్ బాగా ఉంటాయన, ప్రజల ఇష్టపడతారని తెలిపారు.