Sunil Gavaskar : హార్దిక్ పాండ్యా పై సునీల్ గ‌వాస్క‌ర్ షాకింగ్ కామెంట్స్‌.. అతడు అలా చేయ‌డం లేదు.. అందుకే ముంబై ఇలా..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ అద్భుత రీతిలో పుంజుకుంది.

Sunil Gavaskar Points Out Reason Behind MI Incredible Comeback

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ అద్భుత రీతిలో పుంజుకుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఈ టోర్న‌మెంట్‌లోని త‌మ మొద‌టి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడిపోయింది. దీంతో ఈ సీజ‌న్‌లో ముంబై క‌థ ముగిసిన‌ట్లేన‌ని అంతా భావించారు. అయితే.. ఆ త‌రువాత వ‌రుస‌గా ఆరు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించి ప్లేఆఫ్స్ రేసుకు దూసుకువ‌చ్చింది.

కాగా.. గుజ‌రాత్ టైటాన్స్ వారి విజ‌య‌ప‌రంప‌ర‌కు బ్రేక్ వేసింది. అయిన‌ప్ప‌టికి లీగ్ ద‌శ‌లో ముంబై మ‌రో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో సంబంధం లేకుండా ముందై ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు మిగిలిన జ‌ట్ల ఫ‌లితాలు, నెట్‌ర‌న్‌రేట్ వంటి అంశాలు క‌లిసి రావాల్సి ఉంటుంది.

Rohit Sharma : క‌ల‌లో కూడా అనుకోలేద‌న్న రోహిత్ శ‌ర్మ‌.. రితికా సజ్దే భావోద్వేగం..

కాగా.. ఈ సీజ‌న్‌లో ముంబై అద్భుత రీతిలో పుంజుకోవ‌డం పై టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించాడు. ముంబై జ‌ట్టుతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అందుకున్నాడు. అయితే.. ఇది ముంబై ఫ్యాన్స్‌లో చాలా మందికి న‌చ్చ‌లేదు. దీంతో ఐపీఎల్ 2024 సీజ‌న్ స‌మ‌యంలో వారంతా హార్దిక్‌ను హేళ‌న చేశారు. అయితే.. ఈ ఏడాది మాత్రం ప్రేక్ష‌కుల నుంచి హార్దిక్‌కు పూర్తి మ‌ద్ద‌తు ల‌భించింది.

‘గ‌త సంవ‌త్స‌రానికి ఈ సంవ‌త్స‌రానికి ఉన్న తేడా ఏంటంటే.. ఈ సారి హార్దిక్‌కు ప్రేక్ష‌కుల మద్ద‌తు ల‌భిచింది. గ‌తేడాది ముంబై ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ అత‌డికి నిజంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. ఇది అత‌డికి అసంతృప్తిని క‌లిగించింది. అయితే.. ఈ ఏడాది ప‌రిస్థితులు మారిపోయాయి. అత‌డికి ప్రేక్ష‌కులు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ముంబై గెల‌వాల‌ని వారంతా కోరుకుంటున్నారు.’ అని గ‌వాస్క‌ర్ అన్నాడు.

Mumbai Indians : ప్లేఆఫ్స్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ మాస్ట‌ర్ ప్లాన్..! టీమ్‌లోకి విధ్వంస‌క‌ర‌ వీరుడు..

ఇక హార్దిక్ సైతం అటు బ్యాట్‌తో, ఇటు బాల్‌తో రాణిస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

‘ఈ సీజ‌న్‌లో ముంబై గొప్ప‌గా పుంజుకుంది. దాన్ని మ‌నం అంద‌రం చూశాము. ఈ సీజ‌న్‌లో హార్దిక్ ఎంతో ప‌రిణితి సాధించాడు. తోటి ఆట‌గాళ్లు మైదానంలో మిస్ ఫీల్డ్ చేసిన‌ప్పుడు, క్యాచ్ డ్రాప్ చేసిన‌ప్పుడు హార్దిక్ ఎలాంటి భావోద్వేగాల‌ను చూపించ‌డం లేదు. త‌న ఫీల్డింగ్ స్థానానికి వెళ్లిపోతున్నాడు. ఇలాంటి స‌మ‌యంలో కెప్టెన్ కొంచెం సైగ‌ చేసినా చాలా ఫీల్డ‌ర్లు ఆందోళ‌న చెందుతారు. కానీ హార్దిక్ అలా చేయ‌డం లేదు. ముంబై అద్భుత రీతిలో పుంజుకోవ‌డానికి ఇది కూడా ఓ కార‌ణం.’ అని గ‌వాస్క‌ర్ అన్నాడు.

ఇక సాధార‌ణంగా ముంబై ఇలా పుంజుకోవ‌డం గ‌తంలోనూ చూశాం. ముంబై అభిమానిగా చెబుతున్నా.. వారు విజ‌య ప‌రంప‌రంను కంటిన్యూ చేస్తార‌ని ఆశిస్తున్నా. క‌ప్పును కొడ‌తార‌ని అనుకుంటున్నా న‌ని గ‌వాస్క‌ర్ ఆశాభావాన్ని వ్య‌క్తం చేశాడు.