Rohit Sharma : కలలో కూడా అనుకోలేదన్న రోహిత్ శర్మ.. రితికా సజ్దే భావోద్వేగం..
ముంబయిలోని వాంఖడె స్టేడియంలోని ఓ స్టాండ్‌కు శుక్రవారం అధికారికంగా రోహిత్ పేరు పెట్టారు.

Rohit Sharma stand unveiled at the iconic Wankhede Stadium
ముంబై వాంఖడే స్టేడియంలోని ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరును పెట్టిన సంగతి తెలిసిందే. ఈ స్టాండ్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమా-గురునాథ్ శర్మలు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత శరద్ పవార్, భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్‌లతో పాటు రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే కూడా హాజరైంది.
తన పేరిట స్టాండ్‌ను ఆవిష్కరించిన తరువాత రోహిత్ శర్మ మాట్లాడాడు. తన పేరిట స్టాండ్ ఉన్న స్టేడియంలో మ్యాచ్‌లు ఆడనుండడం ఎంతో ప్రత్యేక అనుభూతిగా మిగలనుందని చెప్పాడు. వాంఖడే లాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎందరో దిగ్గజాల సరసన తన పేరు ఓ స్టాండ్‌కు ఉండడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పాడు. తన కుటుంబం, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరగడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
RCB vs KKR : కేకేఆర్‌తో మ్యాచ్.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం పై కీలక అప్‌డేట్..
THE ROHIT SHARMA STAND. ❤️
– Rohit’s parents inaugurating the stand. A beautiful moment! (Vinesh Prabhu).pic.twitter.com/j40jzFEWjO
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 16, 2025
చిన్నప్పుడు ముంబై, భారత్ తరఫున ఆడాలని కోరుకున్నప్పుడు ఇలాంటి ఓ గౌరవం దక్కుతుందని కలలో కూడా అనుకోలేదన్నాడు. ఏ ఆటగాడు అయినా అత్యుత్తమ ప్రదర్శన చేయాలని, జట్టుకు అద్భుత విజయాలను అందించాలని ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లు సాధిస్తారు. అయినప్పటికి వాటిన్నింటి కంటే ఇది ఎంతో ప్రత్యేకమైందని చెప్పాడు. వాంఖడే స్టేడియంలో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు.
Rohit Sharma : శనివారం నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం.. భారీ రికార్డు పై రోహిత్ శర్మ కన్ను.. ఇంకో 72..
‘ఐపీఎల్‌లో మే 21న ఢిల్లీతో జరిగే మ్యాచ్ కోసం ఇక్కడికి వస్తాను. అప్పుడు ఇక్కడ ఆనుండడం నాకు ఓ ప్రత్యేక అనుభూతిగా మిగలనుంది. ఈ మైదానంలో టీమ్ఇండియా తరఫున బరిలోకి దిగడం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. అమ్మా నాన్న, సతీమణి, తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నా కోసం జీవితంలోని చాలా సంతోషాలను వారు దూరం చేసుకున్నారు.’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ స్టాండ్ ఆవిష్కరించే సమయంలో అతడి భార్య రితికా కళ్ల వెంబడి ఆనంద భాష్పాలు వచ్చాయి. రోహిత్ శర్మ ప్రసంగ సమయంలోనూ ఆమె తన చేతులతో కన్నీటిని తుడుచుకోవడం కనిపించింది.
వాంఖడే స్టేడియంలో రోహిత్ పేరుతో పాటు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేరిట కూడా స్టాండ్లను ఆవిష్కరించారు.