Sunil Gavaskar praising relaxed captain patidar
కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025లో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో గెలుపొందింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ పై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గ్రౌండ్‌లో ప్రశాంతంగా ఉంటూ జట్టును అద్భుత రీతిలో ముందుకు నడిపిస్తున్నాడని చెప్పాడు. బెంగళూరు విజయాలకు ఇది ఓ ప్రధాన కారణం అని అన్నాడు.
ఐపీఎల్ 2008లో ప్రారంభమైంది. 17 సీజన్లు పూర్తి కాగా.. ప్రస్తుతం 18 సీజన్ నడుస్తోంది. కాగా.. 17 ఏళ్లుగా ఆర్‌సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే ఉంది. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లకు ఆర్‌సీబీకి మ్యాచ్‌లు ఎలా గెలవాలనే విషయం అర్థం అయ్యిందని అన్నాడు. ప్రశాంతంగా ఉంటే కెప్టెన్‌తో పాటు జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా తమ అనుభవంతో టీమ్‌ను ముందుకు నడిపిస్తున్నారన్నాడు. ఇక కెప్టెన్‌గా పాటిదార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా అనిపిస్తోందన్నాడు.
’17 సంవత్సరాల తరువాత చెన్నైలోని చెపాక్ మైదానంలో తొలి విజయాన్ని నమోదు చేశారు. వాంఖడే మైదానంలో వరుస ఆరు మ్యాచ్‌ల ఓటముల పరంపరకు ముగింపు పలికారు . వీటిని చూస్తుంటే.. నాయకుడిగా పాటిదార్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. 17 ఏళ్లుగా టైటిల్ గెలవలేదు. ఇప్పుడు వారికి ఎలా గెలవాలనే విషయం అర్ధమై ఉంటుంది. మైదానంలో కెప్టెన్ ప్రశాంతంగా ఉండడంతో పాటు ఇతర ఆటగాళ్లు తమ అనుభవంతో జట్టును ముందుకు తీసుకువెలుతున్నారు.’ అని గవాస్కర్ జియోస్టార్‌తో మాట్లాడుతూ చెప్పాడు.
ఆర్‌సీబీ మెంటర్ దినేష్ కార్తీక్ ను సైతం గవాస్కర్ ప్రశంసించాడు. దినేశ్ కార్తీక్ కు ఎంతో అనుభవం ఉంది. అతడు ఎల్లప్పుడూ జూనియర్ ఆటగాళ్లతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడుపుతూ వారికి సరైన మార్గనిర్దేశం చేస్తుంటాడు. రజత్ కు టీమ్‌తో పాటు ఇలాంటి సపోర్టింగ్ స్టాఫ్ దొరకడం అదృష్టం. ప్రస్తుత ఐపీఎల్ టైటిల్ కోసం ఆకలితో ఉంది అని గవాస్కర్ అన్నాడు.
Hardik Pandya : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భారత ఆటగాడు..
సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 12 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67 పరుగులు), రజత్ పాటీదార్ (32 బంతుల్లో 64 పరుగులు) రాణించడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు. విఘ్నేశ్ పుతూర్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం తిలక్ వర్మ (29 బంతుల్లో 56 రన్స్), హార్దిక్ పాండ్య (15 బంతుల్లో 42 రన్స్) దంచికొట్టినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీశాడు.