Rajat Patidar : కెప్టెన్‌గా ముంబై పై తొలి విజయం.. బెంగళూరు సారథి రజత్ పాటిదార్‌కు బీసీసీఐ షాక్..
ముంబై పై విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.

Courtesy BCCI
కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ నాయతక్వంలో ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్‌సీబీ ఖాతాలో 6 పాయింట్లు ఉండగా.. నెట్‌రన్‌రేట్ +1.015గా ఉంది.
సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67 పరుగులు), రజత్ పాటీదార్ (32 బంతుల్లో 64 పరుగులు) జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విఘ్నేశ్ పుతూర్ ఓ వికెట్ తీశాడు.
Hardik Pandya : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భారత ఆటగాడు..
ఆ తరువాత తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (42; 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. ఆర్‌సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
రజత్‌కు ఫైన్..
ముంబై పై విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. రూ.12 లక్షల జరిమానా విధించింది. ముంబైతో మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్లో ఓవర్ రేటు నమోదు చేయడమే ఇందుకు కారణం.
నిర్ణీత సమయంలో బెంగళూరు జట్టు ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోవడంతో ఐపీఎల్ నిర్వాహకులు ఆర్‌సీబీ కెప్టెన్‌కు ఫైన్ వేశారు. ఈ సీజన్‌లో బెంగళూరుకు ఇదే తొలి తప్పిదం కావడంతో రూ.12లక్షల ఫైన్ మాత్రమే విధించారు.