MI vs RCB : మొన్న స్లోగా ఆడాడని రిటైర్డ్ ఔట్.. కట్ చేస్తే.. ఆర్‌సీబీపై 193కి పైగా స్ట్రైక్‌రేట్‌తో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ప్లేట్ ఫిరాయించిన హార్దిక్ పాండ్యా..
ఆర్‌సీబీపై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ పై హార్దిక్ పాండ్యా ప్రశంసల వర్షం కురిపించాడు.

Courtesy BCCI
ముంబై ఇండియన్స్ జట్టులో గత కొన్నాళ్లుగా కీలక ఆటగాడిగా ఉంటూ వస్తున్నాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. అయితే.. ఏప్రిల్ 4న లక్నోతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ కాస్త ఇబ్బంది పడ్డాడు. 23 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు.
ఆ మ్యాచ్‌లో ముంబై విజయానికి ఆఖరి ఏడు బంతుల్లో 24 పరుగులు అవసరమైన సమయంలో అతడిని రిటైర్డ్ కమ్మని జట్టు కోచ్ మహేలా జయవర్ధనే చెప్పాడు. దీంతో చేసేది లేక తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇది వ్యూహాత్మక నిర్ణయం అని, తిలక్ వేగంగా ఆడలేకపోవడంతోనే ఇలా చేశామని, ఇందులో ఎలాంటి తప్పులేదని మ్యాచ్ అనంతరం మహేలా జయవర్ధనే చెప్పాడు.
‘ఆ దశలో మాకు కొన్ని భారీ షాట్లు కొట్టే ప్లేయర్ అవసరం. తిలక్ ధాటిగా ఆడలేకపోతున్నాడు. అది కనిపిస్తూనే ఉంది. క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు ఎంత కష్టపడినా కానీ మ్యాచ్‌ల్లో కొన్ని సార్లు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అర్ధమై ఉంటుంది.’ అని హార్దిక్ నాటి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తెలిపాడు.
193కి పైగా స్ట్రైక్ రేటుతో..
లక్నోతో మ్యాచ్‌లో తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్ గా రమ్మనంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. మాజీ ఆటగాళ్లు.. ముంబై జట్టుతో పాటు కెప్టెన్ హార్దిక్, కోచ్ మహేలా జయవర్ధనే పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో తిలక్ ఆడిస్తారా? లేదా? అనే అనుమానం కలిగింది.
అయితే.. ఆర్‌సీబీ మ్యాచ్‌లో తిలక్‌ను ఆడించారు. ఈ సారి తిలక్ చితక్కొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 56 పరుగులతో ముంబై టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తన బ్యాట్‌తోనే తిలక్ అన్నింటికి సమాధానం చెప్పాడు.
తిలక్ పై ప్రశంసలు..
ఇక ఆర్‌సీబీతో మ్యాచ్ ముగిసిన తరువాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ చాలా చక్కటి ప్రదర్శన చేశాడని చెప్పాడు. గత మ్యాచ్‌లో చాలా విషయాలు జరిగాయన్నాడు. ప్రజలు ఎన్నో ఊహించుకున్నారు. అయితే.. వాస్తవం ఎంటంటే.. ఆ మ్యాచ్‌కు ముందు రోజు అతడి తలకు దెబ్బ తగిలిందనే విషయం దాదాపుగా ఎవ్వరికి తెలియదు. మ్యాచ్‌లో అతడిని రిటైర్డ్ ఔట్‌గా ప్రకటించడం వెనక వ్యూహం ఉన్నప్పటికీ.. తిలక్ వేలికి గాయమైంది. దీంతో అతడు దూకుడుగా ఆడలేకపోయాడు. దీంతో కోచ్ కొత్త బ్యాటర్‌ను క్రీజులోకి పంపిస్తే బాగుంటుందని భావించాడు అని హార్దిక్ అన్నాడు.
దీనిపై నెటిజన్లు కాస్త భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ విషయం ఆ మ్యాచ్ పూరైన తరువాత ఎందుకు చెప్పలేదని అంటున్నారు.