Asia Cup 2023 : వాళ్లు అదృష్ట‌వంతులు.. అశ్విన్ గురించి చ‌ర్చ వ‌ద్దు.. న‌చ్చ‌క‌పోతే మ్యాచులు చూడ‌కండి

ఆసియా క‌ప్‌ లో పాల్గొన‌నున్న‌ భార‌త జ‌ట్టును బీసీసీఐ సోమ‌వారం ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ జ‌ట్టులో స్పిన్న‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, చ‌హ‌ల్‌ల‌కు ఛాన్స్ ఇవ్వక‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

Sunil Gavaskar

Asia Cup : ఆగ‌స్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క‌ప్‌(Asia Cup) లో పాల్గొన‌నున్న‌భార‌త జ‌ట్టును బీసీసీఐ (BCCI) సోమ‌వారం ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ జ‌ట్టులో 17 మందికి చోటు ఇచ్చారు. అయితే.. స్పిన్న‌ర్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(Ravichandran Ashwin), చ‌హ‌ల్‌(Chahal)ల‌కు ఛాన్స్ ఇవ్వక‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌లువురు మాజీ క్రికెట‌ర్లతో పాటు ఫ్యాన్స్ సెల‌క్ట‌ర్ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనిపై మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar) మండిప‌డ్డాడు. సెల‌క్ష‌న్ జ‌రిగిపోయింద‌ని, ఇది మ‌న జ‌ట్టు అని, విమ‌ర్శ‌లు మానుకొని మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరాడు.

ఆసియాక‌ప్‌కు ఎంపిక చేసిన 17 మంది బృందంలోంచే ప్ర‌పంచ క‌ప్‌కు జ‌ట్టును ఎంపిక చేయాల‌ని గ‌వాస్క‌ర్ సూచించారు. కొంత‌మంది ఆట‌గాళ్లు అదృష్ట‌వంతులేన‌ని అన్నాడు. జ‌ట్టు ఎంపిక జ‌రిపోయింద‌ని, ఇప్పుడు చేసేది ఏమీ ఉండ‌ద‌న్నాడు. ఇప్పుడు అశ్విన్ గురించి చ‌ర్చించినా పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌ద‌న్నాడు. అందుక‌నే చ‌ర్చ‌ను ఆపేయాల‌న్నాడు. ఇది మ‌న జ‌ట్టు అని, జ‌ట్టుకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు. అంతేనా.. మీకు జ‌ట్టు ఎంపిక న‌చ్చ‌పోతే మ్యాచ్‌లు చూడొద్దు అంటూ విమ‌ర్శ‌లు చేసేవారిపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Asia Cup 2023 : ఆసియా క‌ప్ మ్యాచుల‌ను ఫ్రీగా చూడొచ్చు.. ఎక్క‌డంటే..?

జ‌ట్టులో స‌మ‌తుల్య‌త ఎంతో ముఖ్య‌మ‌ని గ‌వాస్క‌ర్ అన్నారు. చ‌హ‌ల్‌ను తీసుకోక‌పోవ‌డంపైనా స్పందించారు. చ‌హ‌ల్‌తో పోలిస్తే లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో కుల్దీప్ యాద‌వ్ కొంచెం మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడు. అందుక‌నే కుల్దీప్ వైపు మొగ్గార‌ని భావిస్తున్న‌ట్లు చెప్పాడు. ఆసియా క‌ప్‌లో మొద‌టి మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌ని కేఎల్ రాహుల్ ఎంపిక‌ను గ‌వాస్క‌ర్ స‌మ‌ర్థించాడు. ఆసియా కప్ గెలవడం ముఖ్యమే అయిన‌ప్ప‌టికీ ప్రపంచ కప్ లక్ష్యం. కాబట్టి టీమ్ మేనేజ్‌మెంట్ కేఎల్‌ రాహుల్‌ను ప్రపంచ కప్ జట్టులో కోరుకుంటే, వారు అతనిని ఆసియా కప్‌కు ఎంపిక చేయడం సరైనదని తాను భావిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చాడు.

Virat Kohli : కోహ్లీ క్రికెటర్ కాకపోయుంటే ఏ క్రీడలో రాణించేవాడు..? భువనేశ్వర్ కుమార్ ఏం చెప్పాడంటే..

కేఎల్ రాహుల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేద‌ని తెలుస్తోంది. అత‌డు ఆసియా క‌ప్‌లో మొద‌టి, రెండు మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండే అవ‌కాశాలు లేవ‌ని చీఫ్ సెల‌క్ట‌ర్ గ‌వాస్క‌ర్ చెప్పారు. మూడో మ్యాచ్ స‌మ‌యానికి అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని తెలిపారు. ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు ఆసియా క‌ప్ జ‌ర‌గ‌నుంది. హైబ్రిడ్ మోడ్‌లో వ‌న్డే ఫార్మాట్‌లో ఈ సారి టోర్నీ జ‌ర‌గ‌నుంది. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 2న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో ఆడ‌నుంది.

ఆసియా క‌ప్‌కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), ర‌వీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, షమీ, కుల్దీప్ యాదవ్‌, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సంజు శాంసన్‌ (రాహుల్‌కు బ్యాకప్‌).

Yuzvendra Chahal : ఆసియా క‌ప్‌లో ద‌క్క‌ని చోటు.. చ‌హ‌ల్ ట్వీట్ వైర‌ల్

ట్రెండింగ్ వార్తలు