Sunil Gavaskar slams India for cancelling warm up match before Australia Tests
Sunil Gavaskar : సొంతగడ్డపై భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే ఆస్ట్రేలియా పై 4-0 తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొలింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇక ఈ సిరీస్‌కు భారత్ సన్నద్దమవుతున్న తీరును టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తప్పుపట్టాడు.
వాస్తవానికి తొలి టెస్టుకు ముందు భారత్-ఏతో జట్టుతో టీమ్ఇండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే.. వర్క్‌లోడ్, ఆటగాళ్లు గాయపడతారంటూ అంటూ భారత్ చివరి నిమిషంలో దీన్ని రద్దు చేసుకుంది. దీనిపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు నెట్ ప్రాక్టీస్‌కు చాలా తేడా ఉంటుందని చెప్పాడు. ఓ పత్రికకు రాసిన కాలమ్‌లో టీమ్ఇండియా సన్నద్దతపై విమర్శలు గుప్పించాడు.
womens Asian Champions Trophy : మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఘనంగా బోణీ కొట్టిన భారత్..
భారత్ పై 3-0 తేడాతో విజయం సాధించిన తరువాత కూడా న్యూజిలాండ్ జట్టు ముంబైలో ప్రాక్టీస్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. సన్నాహక మ్యాచ్‌ను రద్దు చేయడం బుద్ది తక్కువ నిర్ణయం అని అన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాటర్‌కు లభించే ఫీలింగ్ నెట్స్‌లో ఆడితే రాదన్నాడు. ఇక సేనా దేశాల్లో టీమ్ఇండియా తొలి మ్యాచుల్లో ఎప్పుడు గెలవలేదు. ఇందుకు సరైన ప్రాక్టీస్ లేకపోవడమే కారణం అని అన్నాడు.
నెట్స్‌లో అయితే ఎన్నిసార్లు ఔటైనా బ్యాటింగ్ కొనసాగించవచ్చునని, ఎలాంటి ఒత్తిడి, టెన్షన్ ఉండదన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన ఫీలింగ్ రాదన్నాడు. ఇక బౌలర్లకు కూడా తాము నోబాల్స్ వేస్తున్నామా అనే ఆందోళన ఉండదు. అదే మ్యాచ్‌లో అయితే ఏ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తున్నాం. అనేది తెలుస్తుందన్నారు. ఇక ఆసీస్‌తో మ్యాచ్‌కు మ్యాచ్‌కు చాలా గ్యాప్ ఉంది కాబట్టి కనీసం రెండు రోజుల వామప్ మ్యాచులు ఆడాలని సూచించాడు. దీని వల్ల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకుంటారని చెప్పాడు.