Vishwanath and Sons : విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ విశ్వానాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons)రిలీజ్ డేట్ ఫిక్సైంది.
- Thota Vamshi Kumar
- Updated on- May 28, 2026 / 01:09 PM IST
Suriya Vishwanath and Sons movie release date fix
- కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్
- వెంకీ అట్లూరి దర్శకుడు
- ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్
Vishwanath and Sons : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ విశ్వానాథ్ అండ్ సన్స్. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. లక్కీ భాస్కర్ చిత్రం తరువాత వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈచిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా మూవీ యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.
Ashika Ranganath : దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా.. మిలమిలా మెరిసిపోతున్న ఆషికా రంగనాథ్..
Dear Anbaana Fans, here’s our little note to keep the celebrations going ❤️
Make way for #VishwanathAndSons 😎
Arriving to conquer cinemas worldwide on AUGUST 14th, 2026 🔥#VASonAUG14th @Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84… pic.twitter.com/JNCybaHoEU— Sithara Entertainments (@SitharaEnts) May 28, 2026
మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
