Suryakumar Yadav : చెన్నైతో మ్యాచ్‌కు ముందు కెమెరాను బ‌ద్ద‌లు కొట్టిన సూర్య‌కుమార్ యాద‌వ్‌

మూడు వ‌రుస ఓట‌ములతో సీజ‌న్‌ను ఆరంభించిన ముంబై ఇండియ‌న్స్ కోలుకుంది.

Suryakumar Yadav destroys camera in net session ahead of CSK match

Suryakumar Yadav destroys camera : మూడు వ‌రుస ఓట‌ములతో సీజ‌న్‌ను ఆరంభించిన ముంబై ఇండియ‌న్స్ కోలుకుంది. వ‌రుస‌గా రెండు మ్యాచుల్లోనూ గెలుపొందింది. నాలుగు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో కొన‌సాగుతోంది. గాయం నుంచి కోలుకుని వ‌చ్చిన సూర్య‌కుమార్ గ‌త వారం జ‌ట్టుతో క‌లిశాడు. కాగా.. ఆదివారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో వాంఖ‌డే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్ కోసం ముంబై ఆట‌గాళ్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సూర్య‌కుమార్ యాద‌వ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ కొట్టిన బంతి కెమెరాకు త‌గిలింది. కెమెరా ప‌క్క‌కు ప‌డిపోగా స్టాండ్ ముక్క‌లైంది. ఈ ఫ‌న్నీ వీడియోను పోస్ట్ చేసిన ముంబై ఇండియ‌న్స్‌.. మేము ఏం త‌ప్పు చేశాం సూర్యా దాదా అంటూ స‌ర‌దాగా రాసుకొచ్చింది. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

KL Rahul : న‌యా పేస్ సంచ‌ల‌నం మ‌యాంక్ గాయం పై కేఎల్ రాహుల్ కీల‌క అప్‌డేట్‌.. కావాల‌నే ప‌క్క‌న పెట్టాం

రీ ఎంట్రీలో అదుర్స్‌..

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో గాయ‌ప‌డిన సూర్య‌కుమార్ శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) పున‌రాసం పొందాడు. అక్క‌డ ఫిట్‌నెస్‌ను సాధించాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఆడిన తొలి మూడు మ్యాచుల‌కు దూరం అయ్యాడు. ఫిట్‌నెస్ సాధించ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో అత‌డు విఫ‌లం అయ్యాడు. రెండు బంతులు మాత్ర‌మే ఆడిన అత‌డు డకౌట్ అయ్యాడు.

కాగా.. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో సూర్య‌కుమార్ విశ్వరూపం చూపించాడు. 19 బంతుల్లో 273.68 స్ట్రైక్‌రేటుతో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల బాది 52 ప‌రుగులు చేశాడు. సూర్య రావ‌డంతో ముంబై బ్యాటింగ్ లైన‌ప్ బ‌లం పెరిగింది.

Yuzvendra Chahal : ప్ర‌పంచ రికార్డు పై చాహ‌ల్ క‌న్ను.. మూడు అడుగుల దూరం..

ట్రెండింగ్ వార్తలు