KL Rahul : నయా పేస్ సంచలనం మయాంక్ గాయం పై కేఎల్ రాహుల్ కీలక అప్‌డేట్.. కావాలనే పక్కన పెట్టాం
ఐపీఎల్ 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో ఓటమిని చవిచూసింది.

KL Rahul provides key fitness update on Mayank Yadav injury
KL Rahul – Mayank Yadav : ఐపీఎల్ 17వ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో ఓటమిని చవిచూసింది. హోంగ్రౌండ్ ఏకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు కోల్పోయి 167 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఆయుష్ బదోని (55 నాటౌట్; 35 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్సర్) అర్ధశతకం బాదాడు. కేఎల్ రాహుల్ (39; 22 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్) ఫర్వాలేదనిపించాడు.
అనంతరం లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అరంగేట్ర ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (55; 35 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకం సాధించగా రిషభ్ పంత్ (41; 24 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) దంచికొట్టాడు. మ్యాచ్ ఓటమి అనంతరం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. తమ ఓటమికి గల కారణాలు వివరిస్తూనే పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గాయంపై స్పష్టత నిచ్చాడు.
మయాంక్ బాగానే ఉన్నాడు. అయితే.. వందశాతం ఫిట్‌గా ఉంటేనే ఆడిస్తాం. అతడు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ మేము ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు. అతడికి విశ్రాంతి ఇచ్చాం. మరో రెండు మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. త్వరలోనే అతడు తిరిగి వస్తాడు. తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడనే నమ్మకం ఉంది. అని కేఎల్ రాహుల్ చెప్పాడు.
Yuzvendra Chahal : ప్రపంచ రికార్డు పై చాహల్ కన్ను.. మూడు అడుగుల దూరం..
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ తుంటి నొప్పితో గ్రౌండ్‌ను వీడాడు. కాగా.. అంతక ముందు అతడు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా.. ఐపీఎల్ 2024లో వేగవంతమైన బంతి విసిరిన ఆటగాడిగా మయాంక్ రికార్డు సృష్టించాడు.
ఇంకో 20 పరుగులు చేయాల్సింది..
ఢిల్లీతో మ్యాచ్‌లో మరో 20 పరుగులు చేయాల్సింది. ఆరంభం బాగున్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అయ్యాం. ఆరంభంలో పిచ్ సీమర్లకు అనుకూలించింది. ఆ తరువాత కుల్దీప్ మాపై ఆధిపత్యం ప్రదర్శించాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఆఖరల్లో కుర్రాళ్లు రాణించడం వల్ల ప్రత్యర్థి ముందు ఓ మాదిరి లక్ష్యానైనా ఉంచగలిగాం. ఢిల్లీ బ్యాటర్ జేక్ ప్రేజర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పంత్ – ప్రేజర్‌లు మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు అని కేఎల్ రాహుల్ తెలిపాడు.
కాగా.. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
Jake Fraser McGurk : కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఎవరు?