Suryakumar Yadav retains second spot in T20I batting rankings
ICC T20 rankings : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం రెండే మ్యాచులు ఆడిన అభిషేక్ శర్మ ర్యాంకింగ్స్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికి రెండో టీ20 మ్యాచ్‌లో శతకంతో దుమ్ములేపాడు. ఈ క్రమంలో ఐసీసీ ర్యాంక్సింగ్స్‌లో 75వ స్థానంలో నిలిచాడు. అతడి ఖాతాలో 419 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
అదే విధంగా జింబాబ్వే పై రెండో టీ20లో 47 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 13 స్థానాలు మెరుగుపరచుకున్నాడు. ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక అదే మ్యాచ్‌లో 22 బంతుల్లో 48 పరుగులు చేసిన నయా ఫినిషర్ రింకూ సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని 39వ స్థానంలో ఉన్నాడు.
PCB : ప్రపంచకప్‌లో దారుణ పరాభవం.. పీసీబీ మొదలెట్టింది.. ఇద్దరి పై వేటు.. లైన్‌లో..
ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 844 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య ఖాతాలో 821 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలను కోల్పోయి 646 రేటింగ్ పాయింట్లతో పదో ర్యాంకుకు పడిపోయాడు.
బౌలర్ల విషయానికి వస్తే..
టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక్క భారత బౌలర్ మాత్రమే టాప్-10లో ఉన్నాడు. 644 రేటింగ్ పాయింట్లతో అక్షర్ పటేల్ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. 641 రేటింగ్ పాయింట్లతో కుల్దీప్ యాదవ్ 11వ స్థానంలో ఉండగా.. పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా 14వ ర్యాంకులో నిలిచాడు. బుమ్రా ఖాతాలో 627 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ 718 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
Gautam Gambhir : దటీజ్ గంభీర్.. వచ్చాడు.. వాళ్లే కావాలని డిమాండ్ చేస్తున్నాడు..!
ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే..
ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 213 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక శ్రీలంక స్టార్ ఆటగాడు వనిందు హసరంగ అగ్రస్థానానికి చేరుకున్నాడు. హసరంగ ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.