Gautam Gambhir : ద‌టీజ్ గంభీర్‌.. వ‌చ్చాడు.. వాళ్లే కావాల‌ని డిమాండ్ చేస్తున్నాడు..!

భార‌త క్రికెట్ కోచింగ్‌లో గౌత‌మ్ గంభీర్ శ‌కం మొద‌లు కాబోతుంది.

Gautam Gambhir : ద‌టీజ్ గంభీర్‌.. వ‌చ్చాడు.. వాళ్లే కావాల‌ని డిమాండ్ చేస్తున్నాడు..!

Gautam Gambhir To Appoint New Support Staff For Team India

Gautam Gambhir – New Support Staff : భార‌త క్రికెట్ కోచింగ్‌లో గౌత‌మ్ గంభీర్ శ‌కం మొద‌లు కాబోతుంది. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అత‌డిని రాహుల్ ద్ర‌విడ్ స్థానంలో భార‌త జ‌ట్టు హెడ్ కోచ్‌గా బీసీసీఐ నియ‌మించింది. శ్రీలంక ప‌ర్య‌ట‌న నుంచి గంభీర్ కొత్త బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్నాడు. జూలై 27న ఈ ప‌ర్య‌ట‌న మొద‌లు కానుంది. ఆతిథ్య లంక‌తో భార‌త్ మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడ‌నుంది. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు హెడ్ కోచ్‌గా గంభీర్ కొన‌సాగ‌నున్నాడు.

టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా ఎంపికైన గంభీర్ స‌హాయ సిబ్బందిపై త‌న‌దైన ముద్ర ఉండాల‌ని భావిస్తున్నాడు. ఇందుకు బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా తెలుసోంది. అంద‌రి కంటే ముందుగా అసిస్టెంట్‌ కోచ్‌గా ముంబై మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌ను ఎంపిక చేయాలని గంభీర్ భావిస్తున్నాడ‌ట‌. ప్రస్తుతం నాయ‌ర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు సహాయ కోచ్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. భార‌త జ‌ట్టు బాధ్యతలపై గంభీర్, నాయర్ ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం.

Rahul Dravid : వాళ్లతో పాటే నేనూ.. బోనస్ నగదుపై రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం.. బీసీసీఐ ఏమన్నదంటే?

బౌలింగ్ కోచ్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ పేసర్ ఆర్ వినయ్ కుమార్‌ను కోరుతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ విష‌యాన్ని బీసీసీఐ తెలియ‌జేసిన‌ట్లుగా జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే వీరికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌. ప్ర‌స్తుతం ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న టి.దిలీప్‌ను కొన‌సాగించాల‌ని గంభీర్ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. భార‌త జ‌ట్టు ఫీల్డింగ్ అత్యున్న‌త ద‌శ‌కు చేరుకునేందుకు దిలీప్ ఎంతో శ్ర‌మించాడు. దీంతో అత‌డిని త‌న స‌హ‌య‌క సిబ్బందిగా కొన‌సాగించాల‌ని గంభీర్‌ నిర్ణ‌యించుకున్నాడు.

ఇదిలా ఉంటే.. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్ల‌లో గంభీర్ స‌భ్యుడు. ఆ రెండు టోర్నీల ఫైన‌ల్ మ్యాచుల్లో గంభీరే టాప్ స్కోర‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కేకేఆర్‌కు 2012, 2014లో టైటిళ్ల‌ను అందించాడు. అంతేకాదు.. 2024లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్‌క‌తాకు మెంటార్‌గా గంభీర్ వ్య‌వ‌హ‌రించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డి సామ‌ర్థ్యాల‌పై న‌మ్మ‌కం ఉంచిన బీసీసీఐ అత‌డిని టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా నియ‌మించింది.

Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..