Rahul Dravid : వాళ్లతో పాటే నేనూ.. బోనస్ నగదుపై రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం.. బీసీసీఐ ఏమన్నదంటే?

రాహుల్ ద్రవిడ్ తాజా నిర్ణయంపై బీసీసీఐ వర్గాలు స్పందించినట్లు సమాచారం. రాహుల్ సెంటిమెంట్ ను అర్థం చేసుకొని గౌరవిస్తామని ..

Rahul Dravid : వాళ్లతో పాటే నేనూ.. బోనస్ నగదుపై రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం.. బీసీసీఐ ఏమన్నదంటే?

Rahul Dravid

BCCI : ఐసీసీ పురుషుల టీ0 ప్రపంచ కప్ 2024 ట్రోపీని రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టుపై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు నిలిచింది. ఈ టోర్నీలో భారత్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. దాదాపు 11ఏళ్ల తరువాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. ఈ ప్రక్రియలో ఆటగాళ్లతోపాటు భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా కీలక పాత్ర పోషించాడు. టీమిండియా టోర్నీ విజేతగా నిలవడంతో బీసీసీఐ రూ.125 కోట్లు భారీ నజరానాను ప్రకటించింది.

Also Read : Gautam Gambhir : టీమిండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌ ఆస్తి ఎంతో తెలుసా? ఎన్ని కార్లు ఉన్నాయంటే ..

బీసీసీఐ ప్రకటించిన నజరానాలో జట్టులోని 15 మంది ప్లేయర్లకు రూ. 5కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు రూ. కోటి చొప్పున అందించింది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు రూ. 5కోట్లు, బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్లు చొప్పున బీసీసీఐ బహుమతిగా అందించింది. అయితే, రాహుల్ తనకు దక్కిన రూ. 5కోట్లలో రూ. 2.5 కోట్లు బీసీసీఐకి తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. దీనికి కారణం కూడా ఉంది. తన సహచరులైన..  ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ లకు రూ. 2.5కోట్లు ఇచ్చి.. తనకు రూ. 5కోట్లు ఇవ్వడం సరియైంది కాదని రాహుల్ భావిస్తున్నారట. దీంతో కోచింగ్ స్టాఫ్ తో సమానంగా రూ. 2.5కోట్లు బోనస్ మాత్రమే తీసుకొని మిగిలిన సొమ్మును వెనక్కు ఇచ్చేందుకు రాహుల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తన నగదు బహుమతిని రూ. 2.5కోట్లకు తగ్గించాలని బీసీసీఐను కోరినట్లు హిందస్థాన్ టైమ్స్ పేర్కొంది.

Also Read : హెడ్ కోచ్‌గా నియామకం త‌రువాత గంభీర్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే.. జైషా గురించి ఏమన్నారంటే?

రాహుల్ ద్రవిడ్ తాజా నిర్ణయంపై బీసీసీఐ వర్గాలు స్పందించినట్లు సమాచారం. రాహుల్ సెంటిమెంట్ ను అర్థం చేసుకొని గౌరవిస్తామని బీసీసీఐ పెద్దలు పేర్కొన్నట్లు తెలిసింది. 2018లో అండర్ -19 ప్రపంచ కప్ సాధించిన సమయంలో ద్రవిడ్ ఈ విధంగానే గొప్ప వ్యక్తిలా వ్యవహరించాడు. రాహుల్ ద్రవిడ్ తాజా నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.