హెడ్ కోచ్‌గా నియామకం త‌రువాత గంభీర్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే.. జైషా గురించి ఏమన్నారంటే?

టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైన తరువాత గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా స్పందించారు.

హెడ్ కోచ్‌గా నియామకం త‌రువాత గంభీర్ ఫ‌స్ట్ రియాక్షన్ ఇదే.. జైషా గురించి ఏమన్నారంటే?

Gautam Gambhir

Gautam Gambhir : అందరూ ఊహించినట్లుగానే టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తికావడంతో అతని స్థానంలో గంభీర్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జైషా చెప్పారు. శ్రీలంక పర్యటనతో కోచ్ గా గంభీర్ ఇన్నింగ్స్ మొదలు కానుంది. జులై 27న మొదలయ్యే పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది.

Also Read : Gautam Gambhir : టీమిండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌ ఆస్తి ఎంతో తెలుసా? ఎన్ని కార్లు ఉన్నాయంటే ..

టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైన తరువాత గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా స్పందించారు. నాకు నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న జైషాకు ధన్యవాదాలు. నా దేశానికి సేవ చేయడం ఓ గొప్ప గౌరవం. ఈసారి పాత్ర భిన్నమైంది. కానీ, నా లక్ష్యం మాత్రం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేయడం. టీమిండియా 140 కోట్ల మంది భారతీయుల కలల భారాన్ని మోస్తోంది. ఆ కలలను నిజం చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానిని గంభీర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పేర్కొన్నాడు.

Also Read : Gautam Gambhir : అఫీషియ‌ల్ : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌..

టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలను స్వీకరించాలనే ఉత్సాహంతో ఉన్నాను. ఆటగాడిగా భారత జట్టు జెర్సీని ధరించినందుకు గర్వపడ్డా. కొత్త పాత్రలోనూ అలాగే ఉంటానని గంభీర్ అన్నారు. బీసీసీఐ, ఎన్సీఏ అదిపతి వీవీఎస్ లక్ష్మణ్, సహాయ సిబ్బంది, ముఖ్యంగా ఆటగాళ్లతో కలిసి పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు గంబీర్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నాడు.