Suryakumar Yadav : డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు.. ‘ఇది అంత సుల‌భం కాదు.. నువ్వు ఆడ‌క‌పోయినా..’ సూర్య‌కుమార్ యాద‌వ్ ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌..

నాలుగో టెస్టు ముగిసిన త‌రువాత టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ధ్రువ్ జురెల్ గురించి ఓ పోస్ట్ పెట్టాడు.

Suryakumar Yadavs Instagram story for Dhruv Jurel

మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌ను భార‌త్ డ్రా చేసుకుంది. ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాట‌ర్లు అసాధార‌ణంగా పోరాడారు. ముఖ్యంగా ఆఖ‌రి రోజు ఆల్‌రౌండ‌ర్లు ర‌వీంద్ర జ‌డేజా (185 బంతుల్లో 107 నాటౌట్‌), వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(206 బంతుల్లో 101 నాటౌట్‌)ల పోరాటం ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వీరిద్ద‌రిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికి కూడా జ‌ట్టు విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు ధ్రువ్ జురెల్. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బ్యాటింగ్ చేస్తూ రిష‌బ్ పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డి స్థానంలో మైదానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. ఇంగ్లాండ్ జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు అందుకోవ‌డంతో పాటు కీల‌క ఆట‌గాళ్లు జోరూట్‌, హ్యారీ బ్రూక్‌ల‌ను స్టంపౌట్ చేశాడు.

WCL 2025 : ఉత‌ప్ప డ‌కౌట్.. రాణించిన యూస‌ఫ్ ప‌ఠాన్‌, యువీ, బిన్నీ.. కానీ..

అదే విధంగా లండ‌న్‌లోని లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్‌లోనూ పంత్ వేలికి గాయ‌మైన సంద‌ర్భంలోనూ ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో నాలుగో టెస్టు ముగిసిన త‌రువాత టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ధ్రువ్ జురెల్ గురించి ఓ పోస్ట్ పెట్టాడు. “ఇది అంత సుల‌భ‌మైన విష‌యం కాదు.. నువ్వు తుది జ‌ట్టులో భాగం కాక‌పోయిన‌ప్ప‌టికి కూడా జ‌ట్టు కోసం పాటుప‌డే వ్య‌క్తిగా ఏమీ చేయ‌గ‌ల‌వో అంద‌రికి చూపించావు.. నువ్వు ఎప్పుడూ కూడా బాధ్య‌త‌ల‌ను వ‌దిలి వేయ‌లేవు.” అంటూ సూర్య రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

Rishabh Pant : ఐదో టెస్టు నుంచి రిష‌బ్ పంత్ ఔట్‌.. అత‌డి స్థానంలో ఖతర్నాక్ ప్లేయర్.. ఎవ‌రో తెలుసా?

ఆఖ‌రి టెస్టులో ఛాన్స్‌..
రిష‌బ్ పంత్ గాయంతో ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌కు దూరం అయిన‌ట్లు కోచ్ గంభీర్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్థానంలో ఎన్‌.జ‌గ‌దీశ‌న్‌ను ఎంపిక చేసిన‌ట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక పంత్ లేక‌పోవ‌డంతో జూలై 31 నుంచి ఓవ‌ల్ వేదిక‌గా ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.