Rishabh Pant : ఐదో టెస్టు నుంచి రిష‌బ్ పంత్ ఔట్‌.. అత‌డి స్థానంలో ఖతర్నాక్ ప్లేయర్.. ఎవ‌రో తెలుసా?

టీమ్ఇండియా గ‌ట్టి షాక్ త‌గిలింది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో గాయ‌ప‌డిన టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీప‌ర్‌ రిష‌బ్ పంత్ ఐదో టెస్టుకు దూరం అయ్యాడు.

Rishabh Pant : ఐదో టెస్టు నుంచి రిష‌బ్ పంత్ ఔట్‌.. అత‌డి స్థానంలో ఖతర్నాక్ ప్లేయర్.. ఎవ‌రో తెలుసా?

ENG vs IND Rishabh Pant ruled out of fifth Test due to injury

Updated On : July 28, 2025 / 12:23 PM IST

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య లండ‌న్‌లోని ఓవ‌ల్ మైదానంలో జూలై 31 (గురువారం) నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో 2-1 తేడాతో వెనుక‌బ‌డి ఉన్న భార‌త జ‌ట్టుకు ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం ఎంతో ముఖ్యం. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు గ‌ట్టి షాక్ త‌గిలింది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో గాయ‌ప‌డిన టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీప‌ర్‌ రిష‌బ్ పంత్ ఐదో టెస్టుకు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని బీసీసీఐ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

నాలుగో టెస్టు మ్యాచ్ మొద‌టి రోజు ఆట భార‌త‌ తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ షాట్ ఆడే క్ర‌మంలో రిష‌బ్ పంత్ కుడి పాదానికి గాయ‌మైంది. బంతి అత‌డి పాదాన్ని బ‌లంగా తాకడంతో పంత్ తీవ్ర నొప్పితో ఇబ్బంది ప‌డ్డాడు. అత‌డి పాదం వాయ‌డంతో పాటు ర‌క్తం కారుతూ ఉండ‌డం కెమెరాల్లో క‌నిపించింది. క‌నీసం న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న అత‌డిని గోల్ఫ్ కార్ట్‌లో మైదానంలోంచి బ‌య‌ట‌కు తీసుకువెళ్లి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ENG vs IND : ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ కామెంట్స్‌.. రిస్క్ చేయ‌కూడ‌ద‌ని అనుకున్నాం.. లేకుంటేనా..

అత‌డి కాలు ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్లు వైద్యులు తెలిపారు. క‌నీసం ఆరు వారాల పాటు విశ్రాంతి అవ‌స‌రం అని సూచించారు. అయిన‌ప్ప‌టికి నొప్పి భ‌రిస్తూ.. జ‌ట్టు కోసం పంత్ రెండో రోజు బ్యాటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. నాలుగో టెస్టు డ్రాగా ముగియ‌డంతో అత‌డు ఐదో టెస్టులో ఆడ‌డం లేదు.

ENG vs IND : మాంచెస్ట‌ర్‌లో టీమ్ఇండియా అద్భుత పోరాటం.. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఆ ఇద్ద‌రిని అలా ఎలా వ‌దిలేస్తాం..

అత‌డి స్థానంలో యువ బ్యాట‌ర్ ఎన్ జ‌గ‌దీశ‌న్ ను ఎంపిక చేశారు. ఈ త‌మిళ‌నాడు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కు జాతీయ జ‌ట్టులోకి పిలుపు రావ‌డం ఇదే తొలిసారి. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో జ‌గ‌దీశ‌న్‌కు మెరుగైన రికార్డు ఉంది. 52 మ్యాచ్‌ల్లో 47.50 స‌గ‌టుతో 3373 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 సెంచ‌రీలు, 14 అర్థ‌సెంచ‌రీలు ఉన్నాయి.