T20 World Cup 2021 : నలుగురు డకౌట్.. 84 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ బ్యాటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్..

T20 World Cup 2021

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో సఫారీ బౌలర్లు విజృంభించారు. దీంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్లు కగిసో రబాడా, ఆన్రిచ్ నోర్జే చెరో 3 వికెట్లతో బంగ్లాదేశ్ ను వణికించారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో మెహదీ హసన్ చేసిన 27 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఓపెనర్ లిటన్ దాస్ 24 పరుగులు సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా ఇతర బౌలర్లలో షంసీ 2 వికెట్లు, ప్రిటోరియస్ 1 వికెట్ తీశారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే వరుస షాక్ లు తగిలాయి. ఓపెనర్‌ మహమ్మద్‌ నయీమ్‌ (9), సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్‌ రహీమ్‌ (0) వరుసగా పెవిలియన్‌ చేరారు. కగిసో రబాడ వేసిన నాలుగో ఓవర్లో నయీమ్‌, సర్కార్ వరుస బంతుల్లో ఔట్ కాగా.. ఆరో ఓవర్లో రహీమ్‌.. క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ మహ్మదుల్లా (3), మరో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని ఆశించినా నిరాశే ఎదురైంది.

Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..

అన్రిచ్‌ నోర్జే వేసిన ఎనిమిదో ఓవర్లో అతడు మార్క్‌క్రమ్‌కి క్యాచ్ ఇచ్చాడు. డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే అఫీఫ్‌ హోసైన్ (0) బౌల్డయ్యాడు. దీంతో పది ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 40 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్న లిటన్‌ దాస్ (24)‌.. తబ్రెయిజ్‌ షంసి వేసిన 12వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆఖర్లో మెహెదీ హాసన్‌ (27) వేగంగా ఆడుతున్న క్రమంలో నోర్జేకి రిటర్న్‌ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. చివర్లో వచ్చిన షమీమ్‌ హోసైన్‌ (11), టస్కిన్‌ అహ్మద్‌ (3), నసూమ్‌ అహ్మద్‌ (0) విఫలమయ్యారు. షోరిఫుల్‌ ఇస్లామ్‌ (0) నాటౌట్‌గా నిలిచాడు.