T20 World Cup 2021 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ జోరు.. శ్రీలంకపై ఘన విజయం

టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్ మరో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్ మరో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై 26 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని శ్రీలంక చేధించలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్, మోయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ తలో రెండు వికెట్లు తీశారు. వోక్స్, లివింగ్ స్టన్ చెరో వికెట్ తీశారు. లంక బ్యాటర్లలో హసరంగ(34) టాప్ స్కోరర్. రాజపక్స 26, దసున్ శనక 26, చరిత్ అసలంక 21 పరుగులు చేశారు.

Elon Musk To WFP : రూ. 45వేల కోట్లు ఇస్తా..ఆకలి సమస్య తీర్చగలరా?

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో.. ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. బట్లర్ 101 పరుగులతో అజేయంగా నిలవగా, ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు సాధించింది. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను బట్లర్, మోర్గాన్ జోడీ ఆదుకుంది. ముఖ్యంగా బట్లర్ శివమెత్తాడు. 67 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 6 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్స్ కొట్టి బట్లర్ సెంచరీ సాధించాడు.

అటు, మరో ఎండ్ లో మోర్గాన్ కూడా ధాటిగా ఆడాడు. 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 40 పరుగులు చేశాడు. ఓ దశలో ఇంగ్లండ్ 100 పరుగులు కూడా దాటడం కష్టమే అనిపించినా… బట్లర్, మోర్గాన్ జోడీ ఎదురుదాడికి దిగింది. దాంతో ఇంగ్లండ్ స్కోరు 150 మార్కు దాటింది. లంక బౌలర్లలో స్పిన్నర్ వానిందు హసరంగ 3 వికెట్లు తీయగా, చమీర 1 వికెట్ దక్కించుకున్నాడు.

సూపర్-12 దశలో ఇంగ్లండ్ జట్టు జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. తాను ఆడిన నాలుగు మ్యాచుల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ లోనే నెగ్గింది.

ట్రెండింగ్ వార్తలు