Elon Musk To WFP : రూ. 45వేల కోట్లు ఇస్తా..ఆకలి సమస్య తీర్చగలరా?

భూమ్మీద ఆకలి సమస్యను పరిష్కరించడానికి యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం(WFP) మంచి ప్రణాళికతో వస్తే 6 బిలియన్‌ డాలర్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు టెస్లా

Elon Musk To WFP : రూ. 45వేల కోట్లు ఇస్తా..ఆకలి సమస్య తీర్చగలరా?

Musk

Elon Musk To WFP  భూమ్మీద ఆకలి సమస్యను పరిష్కరించడానికి యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం(WFP) మంచి ప్రణాళికతో వస్తే 6 బిలియన్‌ డాలర్లు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇప్పటికిప్పుడే టెస్లాలో తన వాటాను స్టాక్‌ను అమ్మి ఆ మొత్తాన్ని దానం చేస్తానని మస్క్ ప్రకటించారు.

కాగా, ఇటీవల UN WFP డైరెక్టర్‌ డేవిడ్ బియాస్లీ ఓ ట్వీట్ లో..హెర్ట్జ్ కంపెనీ ఇటీవల 1లక్షా టెస్లాస్ ఆర్డర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ నికర విలువలో 36 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ పెరుగుదలలో ఆరవ వంతు అంటే 6 బిలియన్ డాలర్లు, కరువుతో లేదా ఆకలితో అలమటిస్తున్న 42 మిలియన్ల మంది ప్రజలను రక్షించడంలో సహాయపడగలదు. మస్క్‌ లేదా ఇతర ప్రపంచ కుబేరుల సంపదలో కేవలం 2 శాతం దానం చేస్తే ప్రపంచంలో ఉన్న ఆకలి సమస్యను తీర్చవచ్చునని వ్యాఖ్యానించారు.

సీఎన్‌ఎన్‌లో వచ్చిన ఈ వార్త కథనం క్లిప్పింగ్‌ని డాక్టర్‌ ఎలి డేవిడ్‌ అనే ఓ రీసెర్చర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎలాన్ మస్క్ సంపదలో 2శాతం(6బిలియన్ డాలర్లు).
2020లో UN వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (WFP) 8.4బిలియన్ డాలర్లు సేకరించింది. అది ప్రపంచ ఆకలిని ఎలా తీర్చలేకపోయిందంటూ అక్టోబర్-30న ఎలి డేవిడ్‌ చేసిన ట్వీట్ పై ఆదివారం మస్క్‌ స్పందిస్తూ..6 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ఆకలిని ఎలా తీర్చగలదో WFP ట్విటర్‌ థ్రెడ్‌లో తనకు తెలిపితే..వెంటనే టెస్లా స్టాక్‌ను అమ్మి.. ఆ మొత్తాన్ని దానం చేస్తాన్నారు. అంతేకాక ఈ డబ్బును ఎలా వినియోగిస్తున్నారనే దాని గురించి ప్రజలకు బహిరంగ పర్చాలని.. ఒపెన్‌గా ఉండాలని మస్క్ సూచించారు‌.

అయితే ఎలి డేవిడ్‌ ప్రశ్నల వర్షం నేపథ్యంలో తన వ్యాఖ్యలపై WFP డైరెక్టర్‌ డేవిడ్ బియాస్లీ మరింత వివరణ ఇస్తూ..ఈ బిలియనీర్ల సంపద ప్రపంచ ఆకలిని తీర్చుతుందని మేం చెప్పడం లేదు. ఒక్కసారి ఇచ్చే ఈ మొత్తం.. ప్రస్తుతం ఆకలి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతన్న 42 మిలియన్ల మందిని కాపాడగలదు. 155 మిలియన్ల మంది ఆకలి తీర్చాలంటే 8.4 బిలియన్ల సంపద కావాలన్నారు.యూఎన్‌డబ్ల్యూఎఫ్‌పీ.. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 155 మిలియన్ల మంది సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు.

ALSO READ Owaisi On Akhilesh Jinnah Remark : జిన్నాతో భారత ముస్లింలకు సంబంధం లేదు..అఖిలేష్ పై ఓవైసీ ఫైర్