T20 World Cup 2021 : ఇండియా-పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్.. భారత్‌తో తలపడే పాక్ జట్టు ఇదే..

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 24,2021) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాయాది దేశాలు, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ లు తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై

T20 World Cup 2021 : టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 24,2021) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాయాది దేశాలు, చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్ లు తలపడబోతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందే పాకిస్తాన్ 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

పాక్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఆసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ.

మరోవైపు టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి లేదా అశ్విన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్ధిక్ పాండ్యా ఫిట్ గా లేకపోవడం అతడికి అవకాశాలను క్లిష్టం చేసింది. టీ20 ప్రపంచకప్ లో ఇప్పటి వరకు భారత్, పాక్ లు ఐదు సార్లు తలపడగా… ఐదు సార్లూ టీమిండియానే విజయం సాధించింది.

Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో 200 మందిని రూ.22 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టు

టీ20 వరల్డ్ కప్ లో రెండో అంకానికి తెరలేచింది. శనివారం నుంచి సూపర్-12 పోటీలు ప్రారంభం అయ్యాయి. అబుదాబి వేదికగా తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ జట్లు గ్రూప్-1లో ఉన్నాయి. ఇంకా ఈ గ్రూప్ లో ఇంగ్లండ్, వెస్టిండిస్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, అప్ఘానిస్తాన్, స్కాట్లాండ్, నమీబియా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు