T20 World Cup 2021 : మరోసారి రాణించిన పాకిస్తాన్ బౌలర్లు.. టార్గెట్ 148

టీ 20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అప్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రాణించిన పాకిస్తాన్ బౌలర్లు..

T20 World Cup 2021 : టీ 20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అప్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రాణించిన పాకిస్తాన్ బౌలర్లు మరోసారి అదరగొట్టారు. అప్ఘన్ బ్యాటర్లను కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో అప్ఘానిస్తాన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

PF ఖాతాదారులకు కేంద్రం దీపావళి కానుక… 8.5శాతం వడ్డీకి ఆమోదం

76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన అప్ఘాన్ జట్టుని మహమ్మద్ నబీ(35*), నైబ్(35*) ఆదుకున్నాడు. వీరిద్దరూ ధాటిగా ఆడటంతో అప్ఘనిస్తాన్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. నజీబుల్లా జద్రాన్ (22) రాణించాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఇమద్ వసీమ్ 2 వికెట్లు తీశాడు. అఫ్రిదీ, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షాదాబ్ ఖాన్ తలో వికెట్ తీశారు.

ఓ దశలో 76 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న అఫ్ఘాన్ జట్టును కెప్టెన్ నబీ, గుల్బదిన్ నైబ్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు 100 పరుగులు దాటింది. చివరి ఓవర్లలో పాక్ బౌలర్లపై నబీ, గుల్బదిన్ ఎదురుదాడి చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. నబీ 35, గుల్బదిన్ 35 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు నజీబుల్లా జాద్రాన్ 22, కరీమ్ జన్నత్ 15 పరుగులు సాధించారు.

ట్రెండింగ్ వార్తలు