T20 World Cup 2021
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడ్డాయి. సౌతాఫ్రికా మరో విజయం నమోదు చేసింది. బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 13.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరారు. ఈ క్రమంలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేశారు. కెప్టెన్ టెంబా బవుమా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాన్ డర్ డుస్సెన్ 22, డికాక్ 16 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, మెహదీ హసన్ , నసుమ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
Diabetes : షుగర్ వ్యాధి గ్రస్తులు తీపిపదార్ధాలు తింటే ప్రమాదమా?..
కాగా, ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తర్వాత రెండోస్థానంలో నిలిచింది. సూపర్-12 దశలో సౌతాఫ్రికా ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, ఒక ఓటమి నమోదు చేసింది. అటు, బంగ్లాదేశ్ ఆడిన 4 మ్యాచ్ లలోనూ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అంతకు ముందు, దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో.. బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలింది. 18.2 ఓవర్లలోనే 84 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహెదీ హాసన్ (27) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ మహమ్మద్ నయీమ్ (9), సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0) వరుసగా పెవిలియన్ చేరారు.
WhatsApp Cashback: వాట్సాప్ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్.. ఇలా ట్రై చేయండి!
పది ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 40 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్న లిటన్ దాస్ (24).. తబ్రెయిజ్ షంసి వేసిన 12వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆఖర్లో మెహెదీ హాసన్ (27) వేగంగా ఆడుతున్న క్రమంలో నోర్జేకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే మూడేసి వికెట్లు తీశారు. తబ్రెయిజ్ షంసి రెండు, డ్వేయిన్ ప్రిటోరియస్ ఒక వికెట్ తీశారు.