Hasaranga : టీ20 వరల్డ్ కప్‌లో మరో హ్యాట్రిక్

టీ20 వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్ నమోదైంది. శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇది రెండో హ్యాట్రిక్ కాగా, పొట్టి

Hasaranga

Hasaranga : టీ20 వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్ నమోదైంది. శ్రీలంక బౌలర్ వానిందు హసరంగ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇది రెండో హ్యాట్రిక్ కాగా, పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఓవరాల్ గా ఇది మూడో హ్యాట్రిక్.

15వ ఓవర్ ఆఖరి బంతికి మార్క్రమ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన హసరంగ, 18వ ఓవర్‌లో వరుసగా తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. 46 పరుగులు చేసిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా, ప్రీటోరియస్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు హసరంగ. ఆ తర్వాతి బంతికి రబాడా అవుట్ కోసం అప్పీలు చేసినా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూకి వెళ్లినా బంతి అవుట్‌ సైట్ లెగ్‌కి పిచ్ అవుతుండడంతో నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ అంపైర్.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

2007 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదు చేశాడు బ్రెట్ లీ. ఆ తర్వాత ఆరు సీజన్లలో ఒక్క హ్యాట్రిక్ కూడా నమోదుకాలేదు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్ కర్టీస్ కాంపర్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. ఈ ఇద్దరి తర్వాత టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో మూడో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచాడు హసరంగ.

ఇక టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ బవుమా (46) రాణించగా.. మార్‌క్రమ్‌ (19) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయానికి కావాల్సిన పరుగులు ఎక్కువ ఉండడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే, డేవిడ్‌ మిల్లర్ (23.. 13 బంతుల్లో 2 సిక్స్‌లు), రబాడ (13.. 7 బంతుల్లో 1 ఫోర్‌, ఒక సిక్స్‌) వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. లంక బౌలర్లలో హసరంగ మూడు, చమీర రెండు వికెట్లు పడగొట్టారు.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

వికెట్లు పడినప్పటికీ సౌతాఫ్రికా గెలుపు ఖాయంగానే కనిపించింది. కానీ, 18వ ఓవర్‌లో హసరంగ మాయ చేశాడు. బవుమా, ప్రిటోరియస్‌ని పెవిలియన్‌కి పంపాడు. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా… డేవిడ్‌ మిల్లర్, రబాడ ధాటిగా ఆడటంతో ఒక బంతి మిగిలుండగానే ఆ జట్టు విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్‌ నిశాంక నిలకడగా ఆడుతూ 15వ ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచాడు. 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. 19వ ఓవర్లో నిశాంక ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లలోనే శ్రీలంక మొత్తం 4 వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో వచ్చిన దసున్ శనక (11), చమిక కరుణరత్నే (5), దుష్మంత చమీర (3) వరుసగా పెవిలియన్‌ చేరారు. మహేశ్‌ తీక్షణ (7) నాటౌట్‌గా నిలిచాడు. నిశాంక రాణించినా అతడికి సహకరించే బ్యాటర్‌ లేకపోవడంతో శ్రీలంక పెద్దగా స్కోరు చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రెయిజ్‌ షంసి, డ్వెయిన్‌ ప్రిటోరియస్ మూడేసి, అన్రిచ్ నోర్జే రెండు వికెట్లు తీశారు.