T20 World Cup 2026 Afghanistan announce 15 member squad
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. భారత్, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగాటోర్నీలో (T20 World Cup 2026) పాల్గొనే దేశాలు తమ తమ జట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. రషీద్ ఖాన్ నాయకత్వంలోనే అఫ్గాన్ బరిలోకి దిగనుంది.
అతడికి డిప్యూటీగా ఇబ్రహీం జద్రాన్‌ను ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన బృందంలో ముజీబ్ ఉర్ రెహమాన్ చోటు దక్కించుకున్నాడు. టీ20 అంటే కుర్రాళ్ల ఫార్మాట్ అని అంతా అంటుంటారు. అయితే.. 2026 జనవరి 1న 41 ఏళ్లు నిండనున్న మహ్మద్ నబీ కూడా మెగాటోర్నీ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
RCB : న్యూఇయర్‌కు ముందు ఆర్‌సీబీకి బిగ్‌షాక్..
షాహిదుల్లా కమల్, మహ్మద్ ఇషాక్ తమ స్థానాలను నిలుపుకోగా గుల్బాదిన్ నయీబ్, నవీన్-ఉల్-హక్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఏఎమ్ గజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్జాయ్, జియా ఉర్ రెహమాన్ షరీఫీ లను రిజర్వ్ ఆటగాళ్లుగా అఫ్గాన్ బోర్డు ఎంపిక చేసింది.
Afghanistan recall experienced campaigners for their 15-member #T20WorldCup squad 👊
Details 👇https://t.co/554mBUqu7y
— ICC (@ICC) December 31, 2025
కాగా.. ఈ మెగాటోర్నీ కన్నా ముందు అఫ్గానిస్తాన్ జట్టు వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 19న ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో కూడా మెగాటోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టే బరిలోకి దిగనుందని ACB చీఫ్ సెలెక్టర్ అహ్మద్ షా సులిమాంఖిల్ వెల్లడించారు.
టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడాతో పాటు అఫ్గానిస్తాన్ జట్టు గ్రూప్ డిలో ఉంది. ఇక ఈ టోర్నీలో అఫ్గాన్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న ఆడనుంది. చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో తలపడనుంది.
టీ20 ప్రపంచకప్ 2026 కోసం అఫ్గానిస్తాన్ జట్టు ఇదే..
రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్ (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మహ్మద్ ఇషాక్ (వికెట్ కీపర్), సెదిఖుల్లా అటల్, దర్వీష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా నొమర్‌హమ్, నొమర్‌బదిన్‌జాయ్, గుల్బాబిబ్దిన్‌జాయ్, గుల్బదిన్‌జాయ్, ఉర్ రెహమాన్, నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.