T20 World Cup 2026 India Squad Announcement today
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 మొదలుకానుంది. ఈ మెగాటోర్నీకి మరో 50 రోజుల సమయం ఉంది. అయినప్పటికి కూడా ఈ టోర్నీలో (T20 World Cup 2026) పాల్గొనే భారత జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించబోతున్నారు. 15 మంది బృందంతో కూడిన టీమ్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇన్ని రోజుల ముందుగా జట్టును ప్రకటిస్తున్నప్పటికి కూడా ఆతిథ్య హోదాలో భారత్ టోర్నీ ప్రారంభం అయ్యే వరకు మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇక ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు స్వదేశంలో భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో తలపడే భారత జట్టును కూడా సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు.
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్‌లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లోనూ పెద్దగా రాణించలేదు. అయినప్పటికి కూడా వీరిద్దరి ఎంపిక లాంఛనే అని తెలుస్తోంది.
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీలు ఎన్ని మ్యాచులు ఆడతారంటే..?
గత కొన్నాళ్లుగా విధ్వంసకర ఇన్నింగ్స్‌లలో మెరుపు ఆరంభాలను అందిస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు మిడిల్ ఆడ్డర్‌లో తిలక్ వర్మలను బ్యాటర్లు గా ఎంపిక చేయవచ్చు. ఇక రిజర్వు ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి యశస్వి జైస్వాల్‌కు చోటు కష్టమే. జితేశ్ కు బ్యాకప్ కీపర్‌గా అవకాశం లభించవచ్చు.
హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లు ఆల్‌రౌండర్లుగా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేసర్లుగా ఉండొచ్చు. ఇక స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లు ఎంపిక కావచ్చు. యశస్వి, నితీశ్ కుమార్, రింకూ సింగ్‌లను స్టాండ్ బై ప్లేయర్లు ఎంపిక చేయవచ్చు.
ఇక ఈ మెగాటోర్నీలో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెడుతోంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా టీ20 ప్రపంచకప్ 2026కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి భారత జట్టు (అంచనా)..
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
స్టాండ్ బై ఆటగాళ్లు..
యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్.