Travis Head : ట్రావిస్ హెడ్ విధ్వంసం.. ఇంగ్లాండ్‌కు వాళ్ల స్టైల్‌లోనే ఇచ్చిపడేశాడు.. యాషెస్‌లో సరికొత్త రికార్డు నమోదు
Travis Head : ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ జట్టు బౌలర్లకు మరోసారి చుక్కలు చూపించాడు. యాసెష్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ సెంచరీ చేశాడు.
Travis Head
- సిడ్నీ టెస్టులో ట్రావిస్ హెడ్ విధ్వంసం
- యాసెష్ సిరీస్ ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ సెంచరీ
- 500కు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు
Travis Head : ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ ఇంగ్లాండ్ జట్టు బౌలర్లకు మరోసారి చుక్కలు చూపించాడు. యాసెష్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హెడ్ తుఫాను ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఫలితంగా ఈ సిరీస్‌లో మూడో సెంచరీ నమోదు చేసుకోవటం ద్వారా అతని టెస్టు కెరీర్లో 12వ సెంచరీ సాధించాడు.
Also Read : Virat Kohli : విజయ్ హజారే ట్రోఫీ.. కోహ్లీ మూడో మ్యాచ్‌పై క్లారిటీ వచ్చేసింది.. కోచ్ ఏమన్నారంటే?
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకున్న కంగారు జట్టు.. చివరి టెస్టులోనూ ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
యాషెస్ సిరీస్ లో భాగంగా ఐదో టెస్టు సిడ్నీ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూర్ (160) రాణించాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్సింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 105 బంతుల్లోనే 17ఫోర్లు సాయంతో తన సెంచరీ పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో హెడ్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్‌లో హెడ్ 166 బంతులు ఎదుర్కొని 24 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 163 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
TRAVIS HEAD COMPLETED HIS 3RD ASHES HUNDRED OF THIS SERIES WHILE OPENING.
– One of the best all format player, Head. 👏pic.twitter.com/zFx38t83Bg
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2026
ఇంగ్లాండ్ సొంత అస్త్రమైన ‘బజ్‌బాల్’ తరహాలోనే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. మరోవైపు తాజా సెంచరీతో ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు. యాషెస్ సిరీస్‌లో 500కు పైగా పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ రికార్డు నమోదు చేశాడు. అదీ 75కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ఈ ఘనత సాధించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు ట్రావిస్ హెడ్ 528 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అతగే టాప్‌లో కొనసాగుతున్నాడు.
2019 యాషెస్‌లో స్టీవ్ స్మిత్ 774 పరుగులు చేసిన తర్వాత, ఒకే యాషెస్ సిరీస్‌లో ఈ స్థాయిలో పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 394 పరుగులతో రెండో స్థానంలో ఉన్నా, హెడ్‌తో పోలిస్తే చాలా వెనుకబడ్డాడు.
