Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీలు ఎన్ని మ్యాచులు ఆడతారంటే..?
ఇక అభిమానుల అందరి దృష్టి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే పై (Vijay Hazare Trophy)పడింది.
Virat Kohli and Rohit Sharma Also Confirms Availability For Vijay Hazare Trophy
Vijay Hazare Trophy : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసింది. భారత జట్టు 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక అభిమానుల అందరి దృష్టి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే పై పడింది. మామూలుగా అయితే.. ఈ టోర్నీ గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదుగానీ.. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు భారత జాతీయ జట్టులోని కీలక ప్లేయర్లు అందరూ బరిలోకి దిగనున్నారు.
డిసెంబర్ 24 నుంచి విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ప్రారంభం కానుంది. అయితే.. సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే, శివమ్ దూబె వంటి ఆటగాళ్లు ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఇక టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ తాను తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. అతడు ముంబై తరుపున ఆడనున్నాడు.
IND vs SA : వామ్మో భారత ఆటగాళ్లు.. సంజూ అంపైర్‌ను, హార్దిక్ కెమెరామన్‌ను.. వీడియోలు..
ఇక ముంబై జట్టు గ్రూప్ సిలో ఉంది. ముంబైతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, గోవా, హిమాచల్ ప్రదేశ్ ఈ గ్రూప్‌లో ఉన్నాయి.
భారత టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. కోహ్లీ కూడా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నట్లు తెలుస్తోంది.
ఈ టోర్నీలో ఎలైట్ డివిజన్ మ్యాచ్‌లు డిసెంబర్ 24 నుండి జనవరి 8 వరకు అహ్మదాబాద్, రాజ్‌కోట్, జైపూర్ వేదికగా జరగనున్నాయి. జనవరి 12 నుంచి 18 వరకు జరగనున్న నాకౌట్ మ్యాచ్‌లకు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 24న టోర్నమెంట్ ప్రారంభ రోజున ముంబై జట్టు సిక్కింతో తలపడనుంది.
