×
Ad

IND vs PaK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్.. తొలుత భారత్ బ్యాటింగ్.. స్టార్ బ్యాటర్, బౌలర్ వచ్చేశారు.. నో షేక్‌హ్యాండ్

IND vs PaK : ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. పాకిస్థాన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.

T20 World Cup 2026

IND vs PaK : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలిచి.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.

Also Read : IND w Vs AUS w : ఆసీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా.. పూర్తి మ్యాచ్ ఆడకుండానే తొలి టీ20లో ఘన విజయం

పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. సంజు శాంసన్ స్థానంలో అభిషేక్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. పాకిస్థాన్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగింది.

టీమ్‌ఇండియా తుది జట్టు ఇదే..
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్‌ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

పాకిస్థాన్‌ తుది జట్టు..
సయామ్ ఆయుబ్, సాహిబ్జాద ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ అజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్‌ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్

నో షేక్‌హ్యాండ్..
ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. అదేతీరు టీ20 వరల్డ్‌కప్‌లో తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో పునరావృతమైంది. టాస్ సమయంలో కెప్టెన్లు సూర్యకుమార్, సల్మాన్ ఆఘాలు కాస్త దూరంగానే ఉన్నారు. టాస్ గెలిచిన తరువాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా భారత కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండానే నేరుగా మాట్లాడేందుకు వెళ్లారు.

క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభవార్త..
టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా హైఓల్టేజ్ మ్యాచ్‌ అయిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. మ్యాచ్ సందర్భంగా వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ.. వర్షంపడే సూచనలు ఏమీలేవని తెలుస్తోంది. ఆకాశం ప్రశాంతంగా మారినట్టు శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరుజట్ల మధ్య పూర్తి స్థాయిలో మ్యాచ్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారుతుందని టెన్షన్ పడిన ఫ్యాన్స్ తాజా పరిణామాలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.