×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు నెద‌ర్లాండ్స్ జ‌ట్టు ఇదే.. తెలుగు ఆట‌గాడికి ద‌క్క‌ని చోటు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) పాల్గొనే త‌మ జ‌ట్టును నెద‌ర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది.

T20 World Cup 2026 Netherland announced their squad

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు నెద‌ర్లాండ్స్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న
  • స్కాట్ ఎడ్వర్డ్స్ సార‌థ్యంలో బ‌రిలోకి
  • తెలుగు ఆట‌గాడు తేజ నిడమనూరుకి ద‌క్క‌ని చోటు

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి మ‌రో నెల‌రోజుల కంటే త‌క్కువ స‌మయం ఉంది. ఈ క్ర‌మంలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు త‌మ త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా నెద‌ర్లాండ్స్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. స్కాట్ ఎడ్వర్డ్స్ సార‌థ్యంలో త‌మ జ‌ట్టు ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

15 మంది స‌భ్యుల‌తో కూడిన బృందంలో తెలుగు ఆట‌గాడు తేజ నిడమనూరు చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు. ఆర్యన్‌ దత్, మాక్స్‌ ఒడౌడ్‌ జట్టులో త‌మ స్థానాల‌ను నిలుపుకున్నారు. బాస్‌ డి లీడేకు కూడా చోటు దక్కింది.

SA 20 : సూపర్ కింగ్స్‌కు భారీ షాక్‌.. కెప్టెన్‌కు తీవ్ర‌గాయం.. టోర్నీ నుంచి ఔట్‌..

భార‌త్‌, శ్రీలంక దేశాలు ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) నెద‌ర్లాండ్స్ గ్రూప్‌-ఏలో ఉంది. ఫిబ్ర‌వ‌రి 7న నెద‌ర్లాండ్స్ త‌మ తొలి మ్యాచ్‌ను కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో ఆడ‌నుంది. ఆ త‌రువాత ఫిబ్రవరి 10న ఢిల్లీలో నమీబియాతో, ఫిబ్రవరి 13న యూఎస్‌ఏతో చెన్నై వేదికగా, ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో భార‌త్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

BBL : బీబీఎల్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన తబ్రైజ్ షంసీ.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి..

టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి నెదర్లాండ్స్‌ జట్టు ఇదే..
స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్‌), నోహ్ క్రోస్ (వికెట్‌ కీపర్‌), మాక్స్ ఒ డౌడ్, సాకిబ్ జుల్ఫికర్, ఆర్యన్ దత్, కైల్ క్లైన్, పాల్ వాన్ మీకెరెన్, ఫ్రెడ్ క్లాసెన్, కోలిన్ అకెర్‌మాన్, బాస్‌ డి లీడే, మైకేల్‌ లెవిట్‌, జాక్‌ లయన్‌ కాచెట్‌, లోగన్‌ వాన్‌ బీక్‌, రొలొఫ్‌ వాన్‌ డెన్‌ మెర్వె, టిమ్‌ వాన్‌ డెర్‌ గుటెన్‌.