×
Ad

T20 World Cup Row : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు భారీ ఆర్థిక న‌ష్టం..? ఏకంగా 240 కోట్ల‌కు పైనే?

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే బీసీబీకి భారీ ఆర్థిక న‌ష్టం వాటిల్ల‌నుంది(T20 World Cup Row ).

T20 World Cup Row Bangladesh Suffer huge Financial Loss

  • భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ను బహిష్కరించిన బంగ్లాదేశ్
  • ఈ నిర్ణయంతో సుమారు 240 కోట్ల ఆదాయం కోల్పోనున్న బీసీబీ

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మ్యాచ్‌ల‌ను ఆడేందుకు ఎట్టి ప‌రిస్థితుల్లో భార‌త్‌లో త‌మ జ‌ట్టు అడుగుపెట్ట‌బోద‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) స్ప‌ష్టం చేసింది. భ‌ద్ర‌తా కార‌ణాల‌ను చూపుతూ భార‌త్‌లో త‌మ జ‌ట్టు ఆడే మ్యాచ్‌ల‌ను శ్రీలంక‌కు త‌ర‌లించాల‌నే విజ్ఞ‌ప్తిని ఐసీసీ తిర‌స్క‌రించిన అనంత‌రం బీసీబీ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఇక టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు దాదాపుగా బంగ్లాదేశ్ దూరం కావ‌డంతో ర్యాంకింగ్స్ ఆధారంగా ఆ జ‌ట్టు స్థానంలో స్కాట్లాండ్ కు అవ‌కాశం ద‌క్క‌నుంది. అయితే.. దీనిపై ఐసీసీ ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది.

Rinku Singh : రింకూ సింగ్‌ కీల‌క వ్యాఖ్య‌లు.. జ‌ట్టులోకి వ‌స్తూ, పోతూ ఉండ‌డంతో నా పై ఒత్తిడి ఉంది

240 కోట్ల న‌ష్టం.. ?

కాగా.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు మ‌రో 15 రోజుల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న క్ర‌మంలో బంగ్లాదేశ్ త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఐసీసీ ఎలా స్పందిస్తుంది అన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొని ఉంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే బీసీబీకి భారీ ఆర్థిక న‌ష్టం వాటిల్ల‌నుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడ‌క‌పోతే 27 మిలియ‌న్ డాల‌ర్లు అంటే భార‌త కరెన్సీలో దాదాపు 240 కోట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు న‌ష్ట‌పోవ‌చ్చున‌ని పీటీఐ తెలిపింది. ఇది ముఖ్యంగా ప్రసార ఆదాయం, స్పాన్సర్‌షిప్ ఆదాయం, ఐసీసీ నుంచి ఏటా అందే రెవెన్యూ షేర్ కోల్పోవ‌డం వ‌ల్ల అని పేర్కొంది. ఈ మొత్తం బంగ్లాదేశ్ వార్షిక ఆదాయంలో దాదాపు 60 శాతానికి స‌మానం అని తెలిపింది.

Sunil Gavaskar : నాకు, అభిషేక్‌కు ఉన్న తేడా అదే.. సునీల్ గ‌వాస్క‌ర్ కామెంట్స్ వైర‌ల్‌

బంగ్లా బోర్డుపై నిషేదం?

భ‌ద్ర‌తా కారణాలు కాకుండా రాజ‌కీయ కార‌ణాల‌తో బంగ్లాదేశ్ ఈ టోర్నీకి దూరం అయింద‌ని ఐసీసీ భావిస్తే అప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పై తాత్కాలిక నిషేదం విధించే అవ‌కాశం కూడా ఉంది. భ‌విష్య‌త్తులో బంగ్లాదేశ్ ఐసీసీ టోర్నీల‌కు ఆతిథ్యం ఇచ్చే హ‌క్కుల‌ను సైతం కోల్పోవ‌వ‌చ్చు.