Rinku Singh : రింకూ సింగ్ కీలక వ్యాఖ్యలు.. జట్టులోకి వస్తూ, పోతూ ఉండడంతో నా పై ఒత్తిడి ఉంది
మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ (Rinku Singh) మాట్లాడుతూ.. జట్టులో ఉంటానో లేదో తెలియక తనపై ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Rinku Singh key comments after IND vs NZ 1st T20 match
- తొలి టీ20 మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రింకూసింగ్
- జట్టులోకి వస్తూ పోతూ ఉండడంతో ఒత్తిడి అంటూ వ్యాఖ్య
- తన కారణంగానే కారణంగానే క్యాచ్ మిస్ అని వెల్లడి
Rinku Singh : న్యూజిలాండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రింకూ సింగ్ ఫినిషర్‌గా అద్భుతంగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 20 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 44 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మాట్లాడుతూ.. జట్టులో ఉంటానో లేదో తెలియక తనపై ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అవకాశం వచ్చిన ప్రతీసారి తనని తాను నిరూపించుకోవాల్సి వచ్చిందన్నాడు.
‘జట్టులోకి వస్తూ పోతూ ఉండడంతో నా పై ఒత్తిడి ఉంది. అవకాశం వచ్చిన ప్రతిసారి నన్ను నేను నిరూపించుకుంటున్నాను. ఇక సింగిల్స్, డబుల్స్ తీస్తూ మధ్య మధ్యలో బౌండరీలు కొట్టాలనేది నా ప్రణాళిక. అలాగే ఆఖరి ఉండి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాను. సరిగ్గా అలాగే చేశాను.’ అని రింకూ చెప్పాడు.
Sunil Gavaskar : నాకు, అభిషేక్‌కు ఉన్న తేడా అదే.. సునీల్ గవాస్కర్ కామెంట్స్ వైరల్
ఇంటెంట్ కొనసాగించాలని హెడ్ కోచ్ గంభీర్ సూచించాడని తెలిపాడు. ఇక అర్ష్‌దీప్ తో ఆడుతున్నప్పుడు సింగిల్స్ తీయాలనేది తమ ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు. ఆఖరి ఓవర్‌ను తాను ఆడాలని అనుకున్నానని, ఇదే విషయాన్ని అర్ష్‌దీప్ కు చెప్పానని అన్నాడు. ఇక 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి తన మైండ్ సెట్ ఇలాగే ఉంటుందని చెప్పాడు. ఇక ఓవర్ చివరి రెండు బంతుల్లో మాత్రం బంతిని బలంగా బాదమని అర్ష్‌దీప్ కు చెప్పాను. ఇక అతడు కూడా ఓ బౌండరీ కొట్టాడని తెలిపాడు.
Lord Rinku Singh deserves a place in the team, not just in T20s but also in ODIs. However, some clowns are getting his place and neither perform well nor contribute to the team’s success.#indvsnzt20 pic.twitter.com/OeGe93tlSd
— Shreya (@shreyagenai) January 21, 2026
ఇక క్యాచ్ మిస్ చేయడం గురించి మాట్లాడుతూ.. ఫ్లడ్ లైట్ల కారణంగా క్యాచ్ చేజారలేదన్నాడు. తన తప్పిదం కారణంగానే క్యాచ్ చేజారిందన్నాడు. అయితే.. దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. ఇక ఈ సిరీస్‌లో విజయం సాధించడం చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చాడు. తద్వారా అదే ఊపును టీ20 ప్రపంచకప్ 2026కు తీసుకువెళ్లి అక్కడా కప్పును ముద్దాడాలన్నదే తమ లక్ష్యం అని రింకూ చెప్పాడు.
