T20 World Cup 2022: క్రికెట్ పండగ షురూ.. నేటినుంచి టీ20 ప్రపంచ కప్ ఆరంభం.. అసలైన సమరం ఎప్పటినుంచి అంటే?

క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే, ఈనెల 21 వరకు ఎనిమిది జట్ల మధ్య అర్హత మ్యాచ్ లు జరుగుతాయి. అసలైన సమరం 22 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీలో 23న పాకిస్థాన్ జట్టుతో టీమిండియా తలపడుతుంది.

T20 World Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఉదయం 9.30 గంటల నుంచి పోరు షురూ కానుంది. అయితే, 21వ తేదీ వరకు మెగా టోర్నీలో మొదటి తొలి‌రౌండ్ మ్యాచ్‌లు జరగుతాయి. సూపర్ -12 లో చోటుకోసం ఈ అర్హత రౌండ్‌లో ఎనిమిది జట్లు పోటీ పడతాయి. నేడు (ఆదివారం) గ్రూప్-ఏ‌‌లో నమీబియాతో శ్రీలంక, నెదర్లాండ్స్‌తో యూఏఈ తలపడతాయి. గ్రూప్ స్టేజ్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-12 సమరంకు అర్హత సాధిస్తాయి.

T20 World Cup: వీడిన ఉత్కంఠ.. భారత్ జట్టులోకి మహ్మద్ షమీ.. బుమ్రా స్థానంలో ఎంపిక

ఈనెల 22న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌తో అసలైన సమరం ప్రారంభమవుతుంది. సూపర్ -12లో ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా అయిదింటితో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆ గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేతాయి. గ్రూప్ -ఏలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్ జట్లు ఇప్పటికే చోటు దక్కించుకోగా, గ్రూప్-బిలో భారత్, పాకిస్తాన్ , దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అయితే గ్రూప్ -ఏ, గ్రూప్-బిలో అర్హత సాధించిన నాలుగు జట్లు ఈ సూపర్ -12లో చేరుతాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీమిండియా తొలిపోరు 23న దాయాది జట్టు పాకిస్థాన్‌తో షురూ అవుతుంది. 27న గ్రూప్-ఏ రన్నరప్‌తో, 30న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 2న బంగ్లాదేశ్‌తో, నవంబర్ 6న తొలి రౌండ్ గ్రూప్ -బి విజేతతో భారత్ జట్టు తలపడనుంది. సూపర్-12 లోని రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 9న, రెండో సెమీఫైనల్ నవంబర్ 10న జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 13న జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు