T20 World Cup: వీడిన ఉత్కంఠ.. భారత్ జట్టులోకి మహ్మద్ షమీ.. బుమ్రా స్థానంలో ఎంపిక

అక్టోబర్ 16న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న T20 ప్రపంచ కప్-2022 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టులో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ వెల్లడించింది.

T20 World Cup: వీడిన ఉత్కంఠ.. భారత్ జట్టులోకి మహ్మద్ షమీ.. బుమ్రా స్థానంలో ఎంపిక

Mohammed Shami

T20 World Cup: క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ టోర్నీకి భారత్ జట్టు తరపున పేసర్ మహ్మద్ షమీ ఆడనున్నారు. బుమ్రా స్థానాన్ని షమీతో భర్తీచేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. టీమిండియా పాస్ట్ బౌలర్ బుమ్రా వెన్నునొప్పితో టీ20 ప్రపంచ కప్ టోర్నీకి దూరమయ్యాడు. అయితే అతని స్థానాన్ని ఎవరితో భర్తీచేస్తారన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

Asia Cup 2023: పాకిస్థాన్‌లో ఆసియా కప్-2023 టోర్నీ.. టీమిండియా పాల్గొంటుందా.. బీసీసీఐ ఏమన్నదంటే?

బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేందుకు పలు పేర్లను సెలక్టర్ల కమిటీ పరిశీలించింది. వీరిలో షమీ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే, షమీ కొవిడ్ భారిన పడటంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లకు దూరమయ్యాడు. గత రెండు రోజుల క్రితం అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో సఫలమయ్యాడు. షమీతో పాటు పాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజుద్దీన్, శార్దూల్ ఠాకూర్ నుసైతం ఆస్ట్రేలియా పంపించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ముగ్గురిలో బుమ్రా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను తొలగిస్తూ భారత టీ20 ప్రపంచకప్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. షమీ ప్రస్తుతం ఆస్ట్రేలియా చేరుకున్నాడు. వార్మప్ మ్యాచ్‌లకు ముందు బ్రిస్బేన్‌లో జట్టులో చేరుతాడు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. త్వరలో వీరూ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.