Asia Cup 2023: పాకిస్థాన్‌లో ఆసియా కప్-2023 టోర్నీ.. టీమిండియా పాల్గొంటుందా.. బీసీసీఐ ఏమన్నదంటే?

ఆసియా కప్ -2023 టోర్నీ పాకిస్థాన్‌లో జరగనుంది. అయితే, ఈ టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. టోర్నీకి భారత్ జట్టును పంపించే విషయంలో బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి.

Asia Cup 2023: పాకిస్థాన్‌లో ఆసియా కప్-2023 టోర్నీ.. టీమిండియా పాల్గొంటుందా.. బీసీసీఐ ఏమన్నదంటే?

Asia Cup 2023

Asia Cup 2023: ఆసియా కప్ -2023 టోర్నీ పాకిస్థాన్‌లో జరగనుంది. అయితే ఈ టోర్నీకి బీసీసీఐ భారత్ జట్టును పంపిస్తుందా అనే సందేహాలు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్నాయి. బీసీసీఐ ఇప్పటికే ఈ విషయంపై చర్చలు జరిపినట్లు సమాచారం. పాక్‌లో జరిగే 50ఓవర్ల ఆసియా కప్ టోర్నీకి భారత్ జట్టును పంపించేందుకు బీసీసీఐ సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. కానీ, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. రాబోయే వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు బోర్డు అన్ని రాష్ట్ర సంఘాలకు ఒక లేఖను పంపింది.   ఆ లేఖలో పాకిస్థాన్ కు భారత్ జట్టును పంపించే విషయంపై ప్రస్తావించినట్లు సమాచారం.

T20 World Cup 2022: ఫిట్‌నెస్‌ టెస్టులో షమీకి క్లియరెన్స్.. రేపు ఆస్ట్రేలియాకు షమీ, సిరాజ్, శార్దూల్.. బుమ్రా స్థానం భర్తీపై వీడని ఉత్కంఠ

2023లో 50ఓవర్ల ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత భారత్‌లో ప్రపంచకప్ జరుగుతుంది. బీసీసీఐ తన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని అక్టోబర్ 18న నిర్వహించనుంది. ఈ లోగా కానీ, సమావేశం తరువాత కానీ కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకొని భారత్ జట్టును పాకిస్థాన్ కు పింపించే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

పాకిస్థాన్ – భారత్ జట్లు ప్రస్తుతం ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ప్రత్యేకంగా ఇరుజట్ల మధ్య సిరీస్ లు గత కొన్నేళ్లుగా జరగలేదు. 2012-13లో పాకిస్తాన్ మూడు T20Iలు, ODI సిరీస్ ఆడేందుకు భారత్‌లో పర్యటించింది. ఆ తరువాత ఈ రెండు జట్లు ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఆడలేదు.