Team India arrives in Brisbane for 3rd test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రసవత్తరంగా సాగుతోంది. మొదటి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయాన్ని సాధించింది. ఇక పింక్ బాల్ టెస్టులో 10వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో కీలకమైన మూడో టెస్టు మ్యాచ్‌కు భారత్ సన్నదద్ధం అవుతోంది.
డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడో టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు బ్రిస్బేన్ చేరుకుంది. అడిలైడ్ టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసిపోగా.. మరో రెండు పాటు అక్కడ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
Bhuvneshwar Kumar : ఎలైట్ లిస్ట్‌లో భువనేశ్వర్ కుమార్.. అశ్విన్ రికార్డు సమం..
ఇక షెడ్యూల్ ప్రకారం నేడు అడిలైడ్ నుంచి బ్రిస్బేన్‌కు భారత్ చేరుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ వీడియోను పోస్ట్ చేసింది.
ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరుకోవాలంటే భారత జట్టు మిగిలిన మూడు టెస్టుల్లో విజయం సాధించాల్సి ఉంది. ఈ క్రమంలో గబ్బా ఫైట్‌కు భారత్‌కు సమాయత్తం అవుతోంది. 2021 పర్యటనలో ఆస్ట్రేలియా పేస్‌ను తట్టుకుని భారత్ 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 138 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 89 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించాడు. పంత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (91), ఛతేశ్వర్ పుజారా (56)లు రాణించారు.
IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండగానే.. ఫస్ట్ డే టికెట్లు సోల్డ్..
Adelaide ✅
Hello Brisbane 👋#TeamIndia | #AUSvIND pic.twitter.com/V3QJc3fgfL
— BCCI (@BCCI) December 11, 2024