Bhuvneshwar Kumar : ఎలైట్ లిస్ట్‌లో భువనేశ్వర్ కుమార్.. అశ్విన్ రికార్డు సమం..
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు.

Bhuvneshwar Kumar Equals Ashwin In Elite T20 Wicket Taking List
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో వికెట్ల పంట పండిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భువీ.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రెండు వికెట్లతో భువీ రాణించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సాధించాడు.
భారత్ తరుపున టీ20ల్లో అత్యదిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు. వీరిద్దరు టీ20ల్లో చెరో 310 వికెట్లు తీశారు. ఇక టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాడిగా యుజ్వేంద్ర చాహల్ కొనసాగుతున్నాడు. అతడు పొట్టి ఫార్మాట్‌లో 364 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత పీయూష్ చావ్లా 319 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండగానే.. ఫస్ట్ డే టికెట్లు సోల్డ్..
టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు..
యుజ్వేంద్ర చాహల్ – 364 వికెట్లు
పీయూష్ చావ్లా – 319 వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ – 310 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ – 310 వికెట్లు
జస్‌ప్రీత్ బుమ్రా – 295 వికెట్లు
ఐపీఎల్‌లో చాన్నాళ్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ ఆడాడు. అయితే.. మెగా వేలానికి ముందు అతడిని సన్‌రైజర్స్ వదిలిపెట్టింది. మెగా వేలం 2025లో భువీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
IND vs AUS : మూడో టెస్టుకు ముందు భారత్‌కు ఊహించని షాక్.. గాయపడిన రిషబ్ పంత్..!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆంధ్రా బ్యాటర్లలో ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (34 నాటౌట్) టాప్ స్కోరర్. శ్రీకర్ భరత్ (8) విఫలం అయ్యాడు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, విప్రాజ్ నిగమ్ చెరో రెండు వికెట్లు తీశారు. మొహిసిన్ ఖాన్, శివమ్ మావి చెరో వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యాన్ని యూపీ 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కర్ణ్ శర్మ (48)టాప్ స్కోరర్. రింకూ సింగ్ 22 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచాడు.