IND vs WI 2nd T20 Match: అంతా వారే చేశారు..! భారత్ జట్టు ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు..

నిజాయితీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా లేను. మరో 20 పరుగులు అదనంగా చేస్తే బాగుండేదని హార్డిక్ పాండ్యా అన్నారు.

Captain Hardik Pandya

Hardik Pandya: ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గయానాలో రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. తిలక్ వర్మ (51) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 18.5 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ జట్టులో పూరన్ (67) పరుగులు చేశాడు. మ్యాచ్ ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా వచ్చే మ్యాచ్ లో విజయం సాధిస్తామని అన్నారు.

ICC Cricket World Cup 2023: క్రికెట్ జట్టును భారత్‌కు పంపడంపై పాక్ తుది నిర్ణయం.. ఇండియాపై సంచలన కామెంట్స్

నిజాయితీగా చెప్పాలంటే మా బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషంగా లేను. మరో 20 పరుగులు అదనంగా చేస్తే బాగుండేదని హార్డిక్ పాండ్యా అన్నారు. తనతో సహా మిగతా బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. టాప్-7 బ్యాటర్లపై నమ్మకం ఉంది. తప్పకుండా రాబోయే మ్యాచ్‌లలో మేము గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటామని నాకు నమ్మకం ఉందని హార్ధిక్ పాడ్యా దీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్‌ను హార్ధిక్ పాడ్యా కొనియాడారు. తిలక్ వర్మ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానంలో ఎడమచేతివాటం బ్యాటర్ తిలక్ వర్మ రావడం విభిన్నమైన ప్రయోగం. ఇది సత్ఫలితాలను ఇస్తోందని పాండ్యా చెప్పారు.

IND VS WI 2nd T20 : ఉత్కంఠ పోరులో వెస్టిండీస్‌ విజ‌యం.. వ‌రుస‌గా రెండు టీ20ల్లో గెలుపు

ఇదిలాఉంటే,మ్యాచ్ చివరిలో హార్ధిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయం వల్లనే టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన చాహల్ మరో ఓవర్ వేసే అవకాశం ఉన్నప్పటికీ పాండ్య మళ్లీ అతడికి బౌలింగ్ ఇవ్వలేదు. చివర్లో ముకేశ్ కుమార్ వేసిన ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. దీంతో కరేబియన్ బ్యాటర్లు భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. అద్భుత బౌలింగ్ చేస్తున్న చాహల్‌కు మరో ఓవర్ వేసే అవకాశం ఇవ్వకుండా హార్ధిక్ పాండ్యా తప్పు చేశాడని సోషల్ మీడియాలో పలువురు క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు