మ్యాచ్‌లో చివరి ఓవర్ గురించి సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సహచర ఆటగాళ్లపై ప్రశంసల జల్లు

సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టుపై విజయం అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ చివరి ఓవర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

SuryaKumar yadav

SuryaKumar yadav : ఇండియా వర్సెస్ శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. సూర్యకుమార్ అద్భుత కెప్టెన్సీతో శ్రీలంక సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ విజేతగా నిలిచింది. తద్వారా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ కు శ్రీలంక ఆరు పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో కెప్టెన్ ఎవరైనా ప్రధాన బౌలర్ కు బంతిని ఇస్తారు. కానీ, సూర్య కుమార్ మాత్రం తానే బౌలింగ్ కు దిగి వికెట్లను పడగొట్టి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు. సూపర్ ఓవర్లో మ్యాచ్ విజయం అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ చివరి ఓవర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : అదరగొట్టిన సూర్య, రింకు.. ఇండియా వర్సెస్ శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ హైలెట్స్ వీడియో వైరల్ ..

చివరి ఓవర్ మ్యాజిక్. అయితే, దానికంటే మేం బ్యాటింగ్ చేసే సమయంలో తక్కువ స్కోర్ కే ఐదు వికెట్లు కోల్పోయాం. ఆ సమయంలో నా సహచర ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ప్రత్యర్థిపై పోరాడేందుకు అవకాశం ఉండేలా పరుగులు సాధించగలిగారు. 200 కంటే ఎక్కువ పరుగులు చేసి విజయం సాధిస్తే ఎలా సంబరపడతామో.. 70 పరుగులకే సగం వికెట్లను కోల్పోయినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆటను ఆస్వాదించాలి. అప్పుడే జీవితం సమతూకంగా అనిపిస్తుందని సూర్య అన్నారు.

Also Read : IND vs SL : సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీ.. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఆ రెండు ఓవర్లు.. వీడియో వైరల్

మా యువ ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. దీంతో నా పని చాలా తేలికైంది. మైదానంతోపాటు డ్రెస్సింగ్ రూంలో పాజిటివ్ దృక్పథం ఉంది. గత మ్యాచ్ కు ముందే కొందరికి విశ్రాంతి ఇస్తామని చెప్పాం. ప్రతిఒక్కరూ ఆనందంగా తమ స్థానాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేనే కేవలం కెప్టెన్ గా ఉండటానికి రాలేదు.. నాయకుడిగా ఉండాలనేది నా కోరిక. తద్వారా నాతోటి ప్లేయర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నం చేయడమే నా పని అని సూర్య కుమార్ యాదవ్ తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు