అదరగొట్టిన సూర్య, రింకు.. ఇండియా వర్సెస్ శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ హైలెట్స్ వీడియో వైరల్ ..

ఉత్కంఠభరితంగా సాగిన ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ లో చివరకు టీమిండియా విజేతగా నిలిచింది.

అదరగొట్టిన సూర్య, రింకు.. ఇండియా వర్సెస్ శ్రీలంక మూడో టీ20 మ్యాచ్ హైలెట్స్ వీడియో వైరల్ ..

India VS Sri Lanka Match

Updated On : July 31, 2024 / 8:28 AM IST

IND vs SL T20 3rd Match : ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ లలో భాగంగా మూడో టీ20 మ్యాచ్ మంగళవారం రాత్రి పల్లెకెలె వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివర్లో పార్ట్ టైం బౌలర్లు రింకూసింగ్, సూర్యకుమార్ యాదవ్ లు అద్భుత బౌలింగ్ తో శ్రీలంక విజయాన్ని అడ్డుకున్నారు. మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్లో  టీమిండియా విజేతగా నిలిచింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే బౌండరీ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. మూడో టీ20 మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ వీడియోను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ యూట్యూబ్ లో ఉంచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read : IND vs SL : సూర్యకుమార్ సూపర్ కెప్టెన్సీ.. మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన ఆ రెండు ఓవర్లు.. వీడియో వైరల్