Team India clean sweep two test match series against west Indies
IND vs WI : వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs WI) 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 121 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 35.2 ఓవర్లలో అందుకుంది. టీమ్ఇండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సాయి సుదర్శన్‌లు (39) రాణించారు. యశస్వి జైస్వాల్ (8), శుభ్‌మన్ గిల్ (13) లు విఫలం అయ్యారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ రెండు వికెట్లు తీయగా.. జోమెల్ వారికన్ ఓ వికెట్ సాధించాడు.
ఓవర్ నైట్ స్కోరు 63/1 తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను భారత్ కొనసాగించింది. ఓవర్ నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్‌లు విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఐదో రోజు విజయానికి 58 పరుగులు అవసరం కాగా.. రాహుల్, సుదర్శన్‌లు తమదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగించారు.
స్ట్రైక్ రొటేట్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి దాటించారు. విజయానికి 33 పరుగుల దూరంలో సాయి సుదర్శన్‌ను రోస్టన్ ఛేజ్ ఔట్ చేశాడు. మరికాసేటికే శుభ్‌మన్ గిల్ (13) ని సైతం అతడే పెవిలియన్‌కు చేర్చాడు. అయినప్పటికి భారత్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ధ్రువ్ జురెల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో అతడు అర్ధశతకాన్ని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ గిల్ టాస్ గెలిచి మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యశస్వి జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్(129 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగగా.. సాయి సుదర్శన్ (87) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
Ahmar Khan : విషాదం.. చివరి బంతి వేసి జట్టును గెలిపించి.. పిచ్ పై కుప్పకూలి మరణించిన బౌలర్..
ఆ తరువాత కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికట్లతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 248 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌కు 270 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఫాలో ఆన్ ఆడిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో గట్టిగానే పోరాడింది. జాన్ కాంప్‌బెల్ (115), షై హోప్ (103) శతకాలు సాధించడంతో 390 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పోను భారత్ ముందు 112 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది.