Arshdeep Singh : డేటింగ్ కన్ఫార్మ్ చేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఆమె నా మనిషి.. ఎవరీ సమ్రీన్ కౌర్?
టీమ్ఇండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు
Team India cricketer Arshdeep Singh makes relationship with actor model Samreen Kaur Instagram official
Arshdeep Singh : టీమ్ఇండియా క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్ తన ప్రేమ వ్యవహారాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించాడు. గత కొన్నాళ్లుగా వస్తున్న డేటింగ్ రూమర్లకు తెరదించుతూ.. నటి-మోడల్ సమ్రీన్ కౌర్‌తో ఉన్న సంబంధాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.
ఆదివారం అర్ష్‌దీప్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సమ్రీన్‌తో కలిసి ఉన్న రెండు ఫొటోలను పంచుకున్నాడు. ఒకరినొకరు హత్తుకున్న ఆ ఫొటోలకు “My Person” అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్, సహచర క్రికెటర్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లతో ముంచెత్తారు.
View this post on Instagram
ఎవరీ సమ్రీన్ కౌర్?
1999 సెప్టెంబర్ 7న జమ్మూ కాశ్మీర్లో సమ్రీన్ కౌర్ జన్మించింది. పూణెలో బీకామ్ పూర్తి చేసింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రాతినిధ్యం వహించి ఫైనలిస్ట్‌గా నిలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ తర్వాత మోడలింగ్‌లో అవకాశాలు అందుకొని, నటిగా కెరీర్ ప్రారంభించింది. ’83’, ‘సర్దార్ జీ 2’ వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది.
Vaibhav Sooryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఏకైక ఆటగాడు..
అర్ష్‌దీప్ సింగ్ భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడు. ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ కొనసాగుతున్నాడు. ఇప్పుడిప్పుడే వన్డేల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. 2022లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసిన అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు 91 టీ20లు, 18 వన్డేలు ఆడాడు. టీ20ల్లో 135 వికెట్లు సాధించాడు. ఇందులో రెండు సార్లు నాలుగు వికెట్లు, ఓ సారి ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఇక వన్డేల్లో 30 వికెట్లు పడగొట్టాడు.
