Team India mightbe 4 changes in 5th test against England
లండన్‌లోని ఓవల్ వేదికగా నేటి నుంచి ఇంగ్లాండ్ జట్టుతో భారత్ ఐదో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకబడి ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చోసుకోనున్నాయి.
అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అన్షుల్ కాంబోజ్ వేటు పడనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నారని సమాచారం. ఇక నాలుగో టెస్టులో గాయపడిన రిషబ్ పంత్ ఐదో టెస్టుకు దూరం అయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడడం దాదాపుగా ఖాయమైంది.
రీఎంట్రీ తరువాత వరుసగా మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ పై నాలుగో టెస్టులో వేటు పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలం అవుతున్న నేపథ్యంలో అతడి స్థానంలో కరుణ్ నాయర్ ఆడే ఛాన్స్ ఉంది.
బుమ్రా స్థానంలో గాయం నుంచి కోలుకున్న ఆకాశ్ దీప్ ఆడనున్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్టార్ పేసర్‌గా ఉన్న అర్ష్‌దీప్ సింగ్ ఐదో టెస్టు ద్వారా అరంగ్రేటం చేయనున్నట్లు మీడియా సమావేశంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హింట్ ఇచ్చాడు. అతడు అన్షుల్ కాంబోజ్ స్థానంలో జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా భారత జట్టు నాలుగు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. నాలుగో టెస్టులో అద్భుతంగా ఆడిన ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లపై జట్టు నమ్మకం ఉంచింది. వీరిద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లు కావడంతో మరోసారి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచీకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
Shubman Gill : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. ఐదు భారీ రికార్డులపై కన్నేసిన శుభ్‌మన్ గిల్..
మరోవైపు ఇప్పటికే ఇంగ్లాండ్ తుది జట్టును ప్రకటించింది. గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో జాకబ్ బెతల్‌కు ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా జోఫ్రా ఆర్చర్, కార్స్‌లకు విశ్రాంతి ఇచ్చారు. గత టెస్టులో ఘోరంగా విఫలం అయిన స్పిన్నర్ డాసన్ ను పక్కన బెట్టారు. వీరి స్థానాల్లో అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్ జట్టులోకి వచ్చారు.
ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, ఆట్కిన్సన్, జోష్ టంగ్, ఒవర్టన్.