ENG vs IND : మళ్ళీ పక్కకు తప్పుకోమన్న క్యురేటర్.. ఈ సారి గంభీర్ సైలెంట్‌గా గిల్‌తో కలిసి ఏం చేశాడంటే..?
గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది.

ENG vs IND 5th test Once again Oval Curator Asks Gautam Gambhir To Move Away From
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా నేటి (జూలై 31 గురువారం) నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ఓ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. మంగళవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ సమయంలో.. పిచ్‌కు 2.5 మీటర్ల దూరం నిలబడాలని భారత కోచింగ్ బృందానికి ఓవల్ మైదాన సిబ్బంది చెప్పడంతో వివాదం మొదలైంది.
క్యురేటర్ లీ ఫోర్టిస్ పై టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మండి పడ్డాడు. “మేము ఏం చేయాలో మీరు చెప్పకండి. ఏం చేయాలో, చేయవద్దొ మాకు తెలుసు. మీరు గ్రౌండ్స్‌మెన్స్‌లో ఒకరు మాత్రమే. అంతకు మించి ఇంకా ఏమీ కాదు.” అని ఫోర్టిస్‌కు వైపు వేలు చూపెడుతూ గంభీర్ అన్నాడు.
దీంతో ఆగ్రహించిన ఫోర్టిస్.. ఈ విషయం గురించి మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. ఆ వెంటనే గంభీర్.. “నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో పో..” అంటూ మండిపడ్డాడు. ఆ తరువాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ విషయం పై ఇప్పటికే టీమ్ఇండియా మాజీలు, ఫ్యాన్స్.. క్యురేటర్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బుధవారం రోజు కూడా..
ఇక బుధవారం పిచ్‌కు దగ్గరగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ నిలబడి ఉన్నారు. వారు పిచ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో వారి దగ్గరగా వచ్చిన క్యురేటర్ ఫోర్టిస్ కాస్త దూరంగా వెళ్లాలని చెప్పాడు.
Shubman Gill : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. ఐదు భారీ రికార్డులపై కన్నేసిన శుభ్‌మన్ గిల్..
When Lee Fortis met Gautam Gambhir again…#ENGvsIND pic.twitter.com/rw9JLgqD8N
— Sandipan Banerjee (@im_sandipan) July 30, 2025
అయితే.. ఈ సారి గంభీర్ చాలా కామ్‌గా ఉన్నాడు. కెప్టెన్ గిల్, కోచ్ సితాన్షు కోటక్‌తో కలిసి పక్కకు జరిగాడు. ఈ సమయంలో గంభీర్ కనీసం క్యురేటర్ వైపు కూడా చూడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.