IND vs ENG : ఓవల్ క్యురేటర్, గంభీర్ వాగ్వాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్.. మ్యాచ్‌ల మధ్య విరామంపై తీవ్ర అసంతృప్తి..

ఓవ‌ల్ మైదానంలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేట‌ర్ లీ ఫోర్టిస్‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించారు.

IND vs ENG : ఓవల్ క్యురేటర్, గంభీర్ వాగ్వాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్.. మ్యాచ్‌ల మధ్య విరామంపై తీవ్ర అసంతృప్తి..

Shubman Gill interesting comments on Oval Curator and Gambhir argument

Updated On : July 31, 2025 / 7:44 AM IST

IND vs ENG : భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య గురువారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ మొద‌లుకాక‌ముందే ఓ పెద్ద దుమారం రేగింది. ఓవ‌ల్ మైదానంలో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేట‌ర్ లీ ఫోర్టిస్‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించారు. అంతేకాక.. మ్యాచ్ ల మధ్య విరామంపై గిల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Also Read: IND vs ENG : ఇంగ్లాండ్ జట్టుకు బిగ్‌షాక్.. ఐదో టెస్టుకు స్టోక్స్‌సహా పలువురు ప్లేయర్లు ఔట్.. తుది జట్టు ఇదే..

గంభీర్, లీ ఫోర్టిస్‌ల మధ్య గొడవ ఏంటి..?
ఐదో టెస్టు మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లు ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో పిచ్‌కు 2.5 మీట‌ర్ల దూరంలో ఉండాల‌ని టీమ్ఇండియా స‌హాయ‌క సిబ్బందికి మైదాన సిబ్బంది చెప్పారు. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గురైన గౌతం గంభీర్.. పిచ్ క్యురేట‌ర్ ఫోర్టిస్‌తో వాద‌న‌కు దిగాడు. మేము ఏం చేయాలో మీరు మాకు చెప్ప‌కండి. ఏం చేయాలో మాకు తెలుసు. మీరు గ్రౌండ్స్‌మెన్స్‌లో ఒక‌రు మాత్ర‌మే. అంత‌కు మించి ఇంకా ఏమీ కాదు అని ఫోర్టిస్‌కు వైపు వేలు చూపెడుతూ గంభీర్ అన్నాడు. దీంతో ఆగ్ర‌హించిన ఫోర్టిస్.. ఈ విష‌యం గురించి మ్యాచ్ రిఫ‌రీకి ఫిర్యాదు చేస్తాన‌ని హెచ్చ‌రించాడు. ఆ వెంట‌నే గంభీర్‌.. నీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు చేసుకో పో అంటూ మండిప‌డ్డాడు. ఆ త‌రువాత ఇద్ద‌రు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఆ త‌రువాత‌ పోర్టిస్‌కు భార‌త బ్యాటింగ్ కోచ్ సితాంశు కోట‌క్ స‌ర్ది చెప్పాడు. సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


శుభ్‌మన్ గిల్ ఏమన్నాడంటే..
గంభీర్, ఓవల్ చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ కు మధ్య వాగ్వివాదంపై బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్ స్పందించారు. ‘‘నాకు గుర్తున్నంత వరకు పిచ్‌కు 2.5 మీటర్లు దూరంగా ఉండాలని నిబంధనేమీ లేదు. సాధారణ షూస్ ధరించి లేదా చెప్పులు లేకుండా పిచ్ ను దగ్గరగా చూడటం తప్పేమీ కాదు. అయితే, ఓవల్ చీఫ్ క్యురేటర్ ఎందుకు ఆపారో.. ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. కెప్టెన్, కోచ్‌లకు పిచ్‌ను నిశితంగా పరిశీలించే హక్కు ఉంది. ఈ సిరీస్‌లో మేం నాలుగు మ్యాచ్‌లు ఆడాం. ఎవరూ మమ్మల్ని అలా ఆపలేదు. మాకు ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. చాలాసార్లు పిచ్‌లను దగ్గర నుంచి చూశాం. అయితే, ఇప్పుడు పిచ్ విషయంలో ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు’’ అంటూ గిల్ అన్నారు.


మ్యాచ్‌ల మధ్య విరామంపై అసంతృప్తి..
నాల్గో టెస్టుకు, ఐదో టెస్టుకు మధ్య విరామం ఎక్కువగా లేకపోవటంపై శుభ్‌మన్ గిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఐదు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్‌ల మధ్య కాస్త ఎక్కువ విరామం ఉండాలి. కొన్ని మ్యాచ్‌లకు వారంకుపైగా విరామం ఇచ్చారు. కొన్ని మ్యాచ్‌లకు మూడునాలుగు రోజులు మాత్రమే ఖాళీ ఉంది. ఇలా కాకుండా ప్రతి మ్యాచ్‌కూ కనీసం ఐదు రోజులు విరామం ఉంటే బాగుంటుంది.’’ అని గిల్ అన్నారు.